సమ్మర్ లో పెద్ద సినిమాల సందడి లేకుండా పోయింది. బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేసిన మిడ్ రేంజ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపలేకపోయాయి. ‘విరూపాక్ష’ తప్ప సమ్మర్ లో చెప్పుకోదగ్గ విజయం సాధించిన సినిమాలు లేవు. ప్రతీవారం నామ్ కే వాస్తే అన్నట్టు కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి వెళ్లిపోతున్నాయి. జూన్ మొదటి వారం కూడా అలాగే జరగనుంది. కాకపోతే ఈ వీక్ రిలీజ్ అయ్యే సినిమాలకు ఓ స్పెషాలిటీ ఉంది.
అదేంటి అంటే ఈ వీక్ ఇద్దరు వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందులో ఒకరు నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్, మరొకరు సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్. అభిరామ్ (Abhiram) ‘అహింస’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు, ఇక గణేష్ ‘నేను స్టూడెంట్ సార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గణేష్ ఆల్రెడీ ‘స్వాతి ముత్యం’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ మంచి సినిమా అనిపించుకుంది.
ఇప్పుడు నాంది సతీష్ వర్మ నిర్మాణంలో ‘నేను స్టూడెంట్ సార్’ అనే సినిమా చేశాడు.రాఖి ఉప్పలపాటి ఈ చిత్రానికి దర్శకుడు. గణేష్ కి థియేట్రికల్ సక్సెస్ దొరుకుతుందో లేదో ఈ సినిమాతో తేలిపోనుంది. మరోపక్క తేజ దర్శకత్వంలో ‘అహింస’ చేశాడు అభిరామ్. ఇది కూడా ఓ రకంగా క్రేజీ మూవీనే. ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అన్నది తర్వాత. నటుడిగా దగ్గుబాటి అభిరామ్ ప్రూవ్ చేసుకోవాలి. అదొక్కటే మెయిన్. అందుకే తేజ చేతిలో ఆ బాధ్యతను పెట్టారు. మరి ఈ ఇద్దరి వారసుల్లో ఎవరు మెప్పిస్తారో చూడాలి.