ఒకానొక సమయంలో భారతీయ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా బాలీవుడ్ చిత్రాలు నిలిచేవి. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. భారతీయ సినిమాలు అంటే సౌత్ సినిమాలుగా పేరు సంపాదించుకున్నాయి. బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించింది. ఈ క్రమంలోనే పుష్ప, ఆర్.ఆర్.ఆర్ కేజిఎఫ్, కేజిఎఫ్2 చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాల గురించి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పందిస్తూ బాలీవుడ్ చిత్రాలు సౌత్ ఇండస్ట్రీలో ఎందుకు విజయాలను అందుకోలేకపోతున్నాయి అంటూ సందేహాలను వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే కొందరు బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమాలలో కంటెంట్ లేకపోవటం వల్లే ఆ సినిమాలను ఆదరించడం లేదని వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ స్పందించారు. తాజాగా ఆయన నటించిన ‘దస్వీ’ చిత్రంతో నేరుగా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది.
చదువుకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తూ తెరకెక్కిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందిందని చెప్పాలి. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అభిషేక్ బచ్చన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ పాన్ ఇండియా అనే పదం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పాన్ ఇండియా అనే పదం తెలియదని, ఈ పదంపై తనకు నమ్మకం లేదని తెలిపారు. ఈ పదాన్ని సినిమా ఇండస్ట్రీ కాకుండా మరే ఇండస్ట్రీకైనా వాడుతున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. కేజీఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ హిందీలో మంచి కలెక్షన్లు రాబట్టాయని ఆయన చెప్పుకొచ్చారు.
సినిమాకు భాష అవసరం లేదని, ఏ భాషలో సినిమా వచ్చినా చివరికి అది సినిమా మాత్రమేనని అభిషేక్ తెలియజేశారు. ఇక హిందీ సినిమాలలో కంటెంట్ లేదని చెప్పే మాటలను తాను ఖండిస్తున్నానని హిందీలో కూడా ఎంతో మంచి సినిమాలు వస్తున్నాయని అభిషేక్ వెల్లడించారు. సినిమాలలో కంటెంట్ ఉంటే ఏ భాషలో అయినా హిట్ అవుతుంది, కలెక్షన్లు వస్తాయి. అదే కంటెంట్ లేకపోతే ఏ భాష చిత్రమైన ఫ్లాప్ అవుతుందని ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ వెల్లడించారు