Directors: సినిమా డిజాస్టర్ అయితే తప్పంతా దర్శకుడిదేనా?

  • May 16, 2023 / 06:08 PM IST

యంగ్ డైరెక్టర్లు, మిడిల్ రేంజ్ డైరెక్టర్లు హీరోలకు ఫ్లాపులు ఇచ్చినా ఆ ఫ్లాపుల గురించి ఎక్కువగా చర్చ జరగదు. స్టార్ డైరెక్టర్లు ఒక్క ఫ్లాప్ ఇచ్చినా మాత్రం ఆ ఫ్లాప్ గురించి సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ అవుతుంది. గతేడాది విడుదలైన ఆచార్య మూవీ మార్నింగ్ షోకే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన కొరటాల శివకు ఆచార్య రూపంలో తొలి షాక్ తగిలింది.

ఆచార్య సినిమా ఫలితం తర్వాత చిరంజీవి సైతం పరోక్షంగా కొరటాల శివ తప్పు ఉందనే విధంగా కామెంట్లు చేశారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే చిరంజీవి మాత్రం తాను అలా అనలేదని ఒక సందర్భంలో స్పష్టత ఇచ్చారు. అయితే గత నెలలో విడుదలైన ఏజెంట్ మూవీ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ సురేందర్ రెడ్డిపై పడింది.

పలువురు స్టార్ హీరోలు సురేందర్ రెడ్డితో పని చేయడానికి ఆసక్తి చూపినా ఈ సినిమా రిజల్ట్ వల్ల వెనక్కు తగ్గారు. సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలంటే టాలీవుడ్ స్టార్స్ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే ఏజెంట్ మూవీ షూట్ మొదలైందని అనిల్ సుంకర చెప్పగా అఖిల్ కూడా ఏజెంట్ ఫలితం గురించి స్పందిస్తూ సురేందర్ రెడ్డి పేరును ప్రస్తావించడానికి ఇష్టపడలేదు.

అయితే ఇదే సమయంలో ఒక సినిమా ఫ్లాప్ కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని (Directors) దర్శకులను నిందించడం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లైగర్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడంతో పూరీ జగన్నాథ్ కెరీర్ పై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం పడింది. స్టార్ డైరెక్టర్లకు వరుస షాకులు తగులుతుండటంతో ఆయా దర్శకుల అభిమానులు ఫీలవుతున్నారు. స్టార్ డైరెక్టర్లు సైతం సినిమాల స్క్రిప్ట్ ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus