కమర్షియల్ సినిమాలో మెసేజ్ ను మిక్స్ చేసి విజయాలను సొంతం చేసుకుంటున్న దర్శకుడిగా కొరటాల శివకు పేరుంది. అయితే ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలవడంతో కొరటాల కెరీర్ పై ఆ ఎఫెక్ట్ పడింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తర్వాత సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే కొరటాలకు కొత్త ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎన్టీఆర్ సినిమా రిజల్ట్ ను బట్టి కొరటాల శివకు ఛాన్స్ ఇవ్వాలో లేదో బన్నీ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి.
మరోవైపు ఆచార్య ఫ్లాప్ గురించి కొరటాల శివ ఎలా స్పందిస్తారనే చర్చ సైతం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఆచార్య కథలో మరి కొందరు రచయితలు కూడా భాగమయ్యారని వాళ్ల సూచనల వల్లే ఈ సినిమా రిజల్ట్ పై ఎఫెక్ట్ పడిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆచార్య సినిమా ఫ్లాప్ వల్ల కొంతమంది ప్రేక్షకులలో కొరటాల శివపై నమ్మకం తగ్గిందనే కామెంట్లు మాత్రం జోరుగా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆచార్య కథలో చేసిన మార్పులు సైతం ఈ సినిమాకు ఒకింత మైనస్ గా నిలిచాయనే విమర్శలు సైతం ఉన్నాయి.
ఎక్కువ రోజులు తెరకెక్కించడం కూడా ఈ సినిమాకు ఒకింత మైనస్ గా మారింది. లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ కు ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ రావడం వల్ల సోనూసూద్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారని తెలుస్తోంది. ఆచార్య సినిమా నష్టాల భర్తీ ఇప్పటికే పూర్తైందని ఆచార్య వల్ల కొరటాల శివకు రెమ్యునరేషన్ రూపంలో డబ్బులు దక్కలేదని అదే సమయంలో కొరటాల సొంత డబ్బులను కూడా కొంతమేర త్యాగం చేశారని తెలుస్తోంది.
కొరటాల శివ తర్వాత సినిమాకు 25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోనున్నారు. సాధారణంగా కొరటాల శివ తన ప్రతి సినిమా బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటారు. ఇకపై కొరటాల శివ వాటికి కూడా దూరంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది.