మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. మాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా రాంచరణ్ సహా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో సిద్ధ అనే పాత్రని రాంచరణ్ పోషించడం మరో విశేషంగా చెప్పుకోవాలి. అతనికి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంపై అంచనాలు మొదటి నుంచి భారీగా నమోదవడంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.
కానీ ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి బ్యాడ్ టాక్ రావడంతో ఒక్కసారిగా కలెక్షన్లు పడిపోయాయి. ఈవెనింగ్ షోలు, నైట్ షోల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. కొరటాల సినిమా ఇలా ఉందేంటి అంటూ నెత్తి కొట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇంత మిక్స్డ్ టాక్ తో ఈ చిత్రం మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చు అనే అందరిలోనూ నెలకొంది. టికెట్ రేట్లు హైక్ ఉన్నప్పటికీ ‘ఆచార్య’ కి కలిసొచ్చింది ఏమీ లేదు. అందుతున్న సమాచారం ప్రకారం..
మొదటి రోజు ఈ చిత్రానికి రూ.32 కోట్ల వరకు షేర్ ను నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ లెక్క ఇటీవల విడుదలైన ‘రాధే శ్యామ్’ ‘భీమ్లా నాయక్’ ల కంటే తక్కువే అని చెప్పాలి. ‘ఆచార్య’ తో పోలిస్తే ‘రాధే శ్యామ్’ కు తక్కువ టికెట్ హైక్స్ దక్కాయి. ఇక ‘భీమ్లా నాయక్’ కు ఆంధ్రాలో అయితే టికెట్ హైక్సే లేవు. అయినా స్ట్రాంగ్ గా కలెక్ట్ చేసింది ఆ మూవీ. ‘ఆచార్య’ బ్రేక్ ఈవెన్ కు రూ.134 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!