కొరటాల శివ దర్శకత్వంలో ఎన్నో అంచనాల నడుమ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా మొదటి షో తోనే భారీ డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది.
ఇలా ఈ సినిమా నెగిటివ్ టాక్ సంపాదించుకోవడంతో పూర్తిగా సినిమా కలెక్షన్ల పై తీవ్రమైన ప్రభావం ఏర్పడిందని చెప్పాలి. ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా హీరోలు కలిసినటించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయిందని చెప్పాలి. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కనీస వసూళ్లను కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చెత్త రికార్డులు ఖాతాలో వేసుకుంది.
ఇక ఈ సినిమాని భారీ మొత్తంలో కొనుగోలు చేసిన బయ్యర్లు తీవ్రస్థాయిలో నష్టపోయారు. ఈ విధంగా ఈ సినిమా భారీ నష్టాలను మూటగట్టుకుందని చెప్పాలి. ఈ సినిమా విడుదల అయి ఏకంగా 84 కోట్ల వరకు నష్టాలను ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మించారు.
ఇక ఈ సినిమా భారీ నష్టాలను ఎదుర్కోవడంతో బయ్యర్ల ను ఆదుకోవడానికి నిరంజన్ రెడ్డి రామ్ చరణ్ కొరటాల ముందుకు వచ్చి వారి నష్టాన్ని పూడ్చారు. ఇలా ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇలాంటి చెత్త రికార్డును అందుకోవడంతో కొరటాల పై నెగిటివ్ మార్క్ ఏర్పడింది. ఇక ఈ సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో కొరటాల తన తదుపరి సినిమా పై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Most Recommended Video
మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!