Actor Ajay: సినిమాలకు దూరం కావడానికి అదే కారణం.. అసలు విషయం చెప్పిన అజయ్!
- October 15, 2022 / 04:07 PM ISTByFilmy Focus
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటుడు అజయ్ ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో హీరోకి ఫ్రెండ్ పాత్రలలోను అలాగే విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. దాదాపు 22 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు తాజాగా 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇకపోతే ఈయన 22 సంవత్సరాలు తన సినీ కెరియర్ పూర్తి చేసుకున్న సందర్భంగా
ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ క్రమంలోనే అజయ్ మాట్లాడుతూ..గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలియజేశారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ తాను 22 సంవత్సరాల నుంచి నా పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలలో నటించాను. నేను చేసిన సినిమాలన్నీ కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. అయితే తనకు ప్రాధాన్యత లేని పాత్రలలో అవకాశాలు రావడంతో తాను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని తెలిపారు.

ఇప్పటికీ నా పాత్రకు ప్రాధాన్యత లేని అవకాశాలు వస్తే సినిమాలకు గుడ్ బై చెబుతానని ఈయన తెలిపారు. ఇంటర్వ్యూ సందర్భంగా అజయ్ గత జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు. తాను 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయానని తెలిపారు.

ఇలా ఇంటి నుంచి నేపాల్ వెళ్లిన తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని తిరిగి ఇంటికి రావాలంటే తన దగ్గర డబ్బులు లేక ఎన్నో అవస్థలు పడ్డానని తెలిపారు.అయితే ఆ సమయంలో హోటల్లో గిన్నెలు కడిగి డబ్బులు వచ్చిన తర్వాత తిరిగి ఇండియా చేరుకున్నానని ఈ సందర్భంగా అజయ్ తనకు జరిగిన సంఘటన గురించి తెలియజేశారు.
కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!













