నటుడు, సీనియర్ జర్నలిస్టు మృతి..!

గతకొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.. టాలీవుడ్ సీరియల్ నటి విష్ణు ప్రియ తండ్రి మృతి చెందారనే న్యూస్ మరువక ముందే మరో ప్రముఖ నటుడు, సీనియర్ జర్నలిస్ట్ మరణించారనే వార్తతో సినీ పరిశ్రమతో పాటు మీడియా వర్గాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.. తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరించిన డీఎంకే మురళి ఇకలేరు.. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారాయన.

ఆదివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.. మురళి మృతిపట్ల సినీ పరిశ్రమ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వర్గాల వారు సంతాపం తెలియజేస్తున్నారు.. రంగస్థల కళాకారుడిగా ప్రస్థానం ప్రారంభించి, సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మురళి.. ఆంధ్రప్రదేశ్‌, కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం ఆయన స్వస్థలం.. నటన మీద ఆసక్తితో రంగస్థలంలోకి అడుగుపెట్టారు. పలు పౌరాణిక, సాంఘీక నాటకాల్లో నటించారు. దుర్యోధనుడి మయసభ ఏకపాత్రాభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళి, ఆ తర్వాత సినిమా మీద ఆసక్తితో హైదరాబాద్‌ వచ్చేశారు..

అందరిలానే అవకాశాల కోసం తిరుగుతూ పరిచయాలు పెంచుకున్నారు.. పరిశ్రమకొచ్చిన కొత్తలో ఎదురయ్యే కష్ట నష్టాలను భరించారు. దర్శకత్వ శాఖలో కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత జర్నలిస్ట్‌గా కూడా పని చేస్తూనే.. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవారు.. మొదట ‘అందాల రాక్షసి’ లో ఆయనకు అవకాశం వచ్చింది. మారుతి దర్శకత్వం వహించిన ‘బస్‌స్టాప్‌’ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించారు. నాగ చైతన్య, సునీల్‌ హీరోలుగా నటించిన ‘తడాఖా’లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సినిమాలో సునీల్‌ ఎస్‌ఐగా పనిచేసే స్టేషన్‌కు సీఐగా ఉండే ప్రాముఖ్యమైన పాత్రలో ఆకట్టుకున్నారు.. ‘కొత్తజంట’, ‘కాయ్‌ రాజా కాయ్‌’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మురళి మంచి నటుడే కాదు మంచి వ్యక్తిం కలవారని.. చివరి వరకు సినిమాలకోసమే బతికారని సన్నిహితులు, సినీ, మీడియా మిత్రులు ఆయనతో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుని భాావోద్వేగానికి గురవుతున్నారు..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus