Amala Paul: అమలా పాల్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో అథర్వ మురళి!

అథర్వ మురళి అందరికీ సుపరిచితమే. తమిళంలో ఓ మిడ్ రేంజ్ హీరోగా ఎదిగాడు. అక్కడ ఇతనికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2010 లో వచ్చిన ‘బాణాకతాడి’ చిత్రం ద్వారా ఇతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2013 లో చేసిన ‘పరదేశి’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. ఇక 2019 లో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గద్దలకొండ గణేష్’ (తమిళ ‘జిగర్తాండ’ కి రీమేక్) చిత్రం ద్వారా ఇతను టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.

ఆ సినిమా తర్వాత అథర్వకి తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తాయి అని అంతా భావించారు కానీ.. అలాంటిదేమి జరగలేదు. తమిళంలోనే అతను సినిమాలు చేసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా.. ఇతను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. స్టార్ హీరోయిన్ అమలా పాల్ పై చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి అని చెప్పాలి. ఆమె ఓ చెత్త హీరోయిన్ అంటూ అథర్వ వ్యాఖ్యానించాడు. అతను మాట్లాడుతూ.. “నా సెకండ్ మూవీ ‘ముహుదుముత్ ఉన్ కర్బనై’లో అమలా పాల్ తో కలిసి నటించాను.

షూటింగ్ స్టార్ట్ అయిన 10 రోజులకి (Amala Paul) ఆమెతో చిన్న గొడవ జరిగింది. ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించింది. ఆ గొడవ సెట్ అయ్యింది. కానీ ఆమె ఓ చెత్త హీరోయిన్ అనే విషయాన్ని నేరుగా అమలా పాల్ కి చెప్పాను’ అంటూ అథర్వ మురళి చెప్పుకొచ్చాడు. అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ‘అతను ఈ కామెంట్స్ చేసేంత రేంజ్ కి వెళ్లడం వెనుక ఉన్న కారణం ఏంటి?’ అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus