Baladitya: నమ్మిన వారే తనని మోసం చేస్తున్నారు: బాలాదిత్య వైఫ్

బాలాదిత్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఎన్నో సినిమాలలో నటించారు. అలాగే హీరోగా కూడా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా బాలాదిత్య ఒకవైపు సినిమాలలోను మరోవైపు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ విధంగా తెలుగులో ఈయనకు ఎంతో మంచి క్రేజ్ ఉండడంతో ఈసారి ఈయనకు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఎంతో సౌమ్యుడుగా కొనసాగుతున్న బాలాదిత్య పట్ల సోషల్ మీడియాలో కొంతమంది ప్రశంసలు కురిపించగా మరి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. బాలాదిత్య అందరితో మంచిగా ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ పలువురు భావిస్తున్నారు. ఇలా బాలాదిత్య గురించి ఇలాంటి కామెంట్స్ వినిపించడంతో ఆయన భార్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన భర్త గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తన భర్త ఇంట్లో ఎలా ఉన్నారో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉన్నారని తాను నిజాయితీగా ఆడుతున్నారని తెలిపారు.అయితే బిగ్ బాస్ హౌస్ లో కొందరు తన భర్తకు వెన్నుపోటు పొడుస్తున్నారంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్లో కొంతమంది కంటెస్టెంట్లు ఆయన మంచితనాన్ని వాడుకుంటున్నారని ఈమె బాధపడటమే కాకుండా కొన్ని టాస్కులలో ఆయన నమ్మిన వారే తనని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కానీ తన భర్త మాత్రం సరైన పద్ధతిలోనే ఆట ఆడుతున్నారని ఎలాగైనా తాను టాప్ ఫైవ్ లో ఒకరిగా ఉండి తప్పకుండా టైటిల్ గెల్చుకుంటారనీ ఈ సందర్భంగా బాలాదిత్య భార్య తన భర్త గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus