టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో బెనర్జీ ఒకరనే సంగతి తెలిసిందే. పలు సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి ఆ పాత్రల ద్వారా బెనర్జీ ప్రశంసలు పొందారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న బెనర్జీ ఈ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను మంచి దారిలో పెట్టాలనే ఆలోచనతో చిరంజీవి ఇన్వాల్వ్ అయ్యారని ఆయన చెప్పుకొచ్చారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నాడని చిరంజీవి ఫోన్ లో చెప్పారని ఈ విషయం తెలిసిన కొంత సమయం తర్వాత మోహన్ బాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు పోటీ చేస్తున్నట్టు ప్రకటించాడని బెనర్జీ చెప్పుకొచ్చారు. ఎన్నికల రోజు మోహన్ బాబు నన్ను కొట్టలేదని తనీష్ ను మోహన్ బాబు ఏదో అంటుంటే నేను ముందుకు వెళ్లానని ఆయన తెలిపారు.
ఆ సమయంలో మోహన్ బాబు కోపంతో నన్ను తిట్టారని ఆయన చెప్పుకొచ్చారు. మోహన్ బాబు అలా మాట్లాడటంతో నేను షాకయ్యానని ఆయన కామెంట్లు చేశారు. మోహన్ బాబు అలా మాట్లాడటాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అలా మాట్లాడటంతో నేను సాధారణ మనిషిని కావడానికి మూడు రోజులు పట్టిందని అన్నారు. 50 సంవత్సరాల వయస్సులో సిగరెట్ స్టార్ట్ చేశానని నేను ఫ్యాన్సీ స్మోకర్ అని ఆయన తెలిపారు.
మన దగ్గర టాలెంట్ లేదనే భావనను చాలామంది కలిగి ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ రీజన్ వల్లే ఇతర భాషల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను దిగుమతి చేసుకుంటున్నారని బెనర్జీ అన్నారు. ఇప్పటివరకు ఎన్ని సినిమాలలో నటించానో గుర్తు లేదని ఆయన వెల్లడించారు. ఇంట్లో సినిమాకు సంబంధించిన షీల్డ్ లను కూడాపెట్టుకోలేదని అది బ్యాడ్ హ్యాబిట్ అని బెనర్జీ కామెంట్లు చేశారు.