మలయాళ అగ్ర హీరో మమ్ముట్టి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటుడు దుల్కర్ సల్మాన్. అయితే ఈయన ఎక్కడ తన తండ్రి ఇమేజ్ వాడకుండా సొంత నైపుణ్యంతో ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని ప్రస్తుతం ఆగ్రహ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా మలయాళ హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ తెలుగులో సీతారామం సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సీతారామం సినిమాతో ఈయన తెలుగు హీరోగా మారిపోవడమే కాకుండా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు అభిమాన హీరోగా మారిపోయారు.
ఇకపోతే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న విమర్శలు గురించి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ తాను 2016వ సంవత్సరంలో చార్లీ సినిమాకి ఉత్తమ నటుడిగా కేరళ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నాననీ తెలిపారు. ఈ విధంగా తన సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడంతో తన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక నెటిజన్ నేను నీకు ఇచ్చిన అవార్డు కొనుక్కోవాలి అనుకుంటున్నాను.
నువ్వు కొన్న దాని కన్నా 50,000 ఎక్కువగానే ఇస్తాను అంటూ కామెంట్ చేశారు.అలా ఆరోజు ఆ కామెంట్ చేసిన ట్రోల్ నన్ను ఎంతగానో బాధ పెట్టిందని ఈ సందర్భంగా కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న విమర్శలు గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా నేటిజన్ చేసిన ఈ కామెంట్ తనని బాధ పెట్టింది. ఒకవేళ అవార్డు కొనుక్కోవాలి అంటే అన్ని రోజుల వరకు తాను వెయిట్ చేయనని
ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఇలాంటి అవార్డు కొనుక్కునే వాళ్ళం అంటూ ఈ సందర్భంగా ఈయన గతంలో జరిగిన ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన స్నేహితుడు తనకు ఎంతో ధైర్యం చెప్పి తనని ప్రోత్సహించారని దుల్కర్ తన జీవితంలో జరిగిన ఈ చేదు సంఘటన గురించి అసలు విషయం వెల్లడించారు.
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!