టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిష్ వెంకట్ (Fish Venkat) నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకోగా ఫిష్ వెంకట్ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలలో నటిస్తున్న ఫిష్ వెంకట్ తన ఆరోగ్య స్థితి గురించి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కొన్ని సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో సైతం ఫిష్ వెంకట్ నటించారు. ఒకరోజు ఆయాసం బాగా వచ్చేసరికి ఆస్పత్రికి వెళ్లానని వారం రోజుల చికిత్స తర్వాత డయాలసిస్ అవసరమని వైద్యులు చెప్పారని ఫిష్ వెంకట్ పేర్కొన్నారు.
Fish Venkat
ఆ సమయంలో డయాలసిస్ అంటే ఏంటో కూడా నాకు తెలియదని ఆయన తెలిపారు. ఆ తర్వాత నిమ్స్ లో జాయిన్ అయ్యి ఏడాదిన్నరగా నిమ్స్ లోనే డయాలసిస్ చేయించుకుంటున్నానని ఫిష్ వెంకట్ (Fish Venkat) వెల్లడించారు. బీపీ, షుగర్ వల్ల కాలికి చిన్న దెబ్బ తగిలినా ఇన్ఫెక్షన్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో ఆపరేషన్ చేశారని ఇది జరిగి నాలుగేళ్లు అయిందని ఫిష్ వెంకట్ అన్నారు.
అప్పటినుంచి నా పరిస్థితి పూర్తిగా ఇలా అయిపోయిందని ఆయన పేర్కొన్నారు. రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని అనారోగ్యం వల్ల మూవీ ఆఫర్లు వచ్చినా వెళ్లలేకపోతున్నానని ఫిష్ వెంకట్ (Fish Venkat) కామెంట్లు చేశారు. నా దగ్గర ఖర్చులకు డబ్బులు కూడా ఉండటం లేదని గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నానని ఆయన అన్నారు. ఫిష్ వెంకట్ దీనస్థితి గురించి సెలబ్రిటీలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఎవరైనా ఫిష్ వెంకట్ ను ఆదుకోవడానికి ముందుకు వస్తారేమో చూడాల్సి ఉంది. తోటి నటులకు కష్టాలు వచ్చిన సమయంలో అండగా ఉండాల్సిన బాధ్యత ఇండస్ట్రీకి చెందిన నటులపై ఉంది.