సినీ ఇండస్ట్రీలో విషాదం.. వరల్డ్ ఫేమస్ స్టార్ ఇకలేరు..

గతకొద్ది రోజులుగా సినిమా పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.. ఏ క్షణాన ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు సెలబ్రిటీలు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు.. కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో పలువురు ప్రముఖులు మరణించారు.. సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త మరువకముందే, టాలీవుడ్ డైరెక్టర్ మదన్ కన్నుమూశారు. బాలీవుడ్ నటి తబస్సుమ్ గోవిల్ గుండెపోటుతో మరణించగా.. గతకొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై క్యాన్సర్‌తో పోరాడుతున్న బెంగాలీ యువన నటి ఐంద్రీలా శర్మ కాలం చేశారు.

ఈ ఘటనలు మరువకముందే.. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు మృతిచెందారనే వార్తతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.. ప్రపంచ ప్రఖ్యాత ‘పవర్ రేంజర్ ఫేమ్’ జాసన్ డేవిడ్ ఫ్రాంక్ ఇకలేరు. ఆయన అమెరికాలోని టెక్సాక్స్ లో ఆత్మహత్య చేసుకొని కన్నుమూశాడు. డేవిడ్ ఆత్మహత్య చేసుకొని మరణించాడన్న వార్త తెలిసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. పిల్లలకు ఎంతో ఇష్టమైన ‘పవర్ రేంజర్’ సీరీస్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పటికీ పిల్లలు టీవీల్లో ‘పవర్ రేంజర్’ షోస్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.. అందులోని నటీనటులను ఇమిటేట్ చేస్తుంటారు కూడా.. ‘పవర్ రేంజర్’ లో షో లో జాసన్ డేవిడ్ ఫ్రాంక్ మొదట గ్రీన్ రేంజర్‌తో పాపులారిటీ సంపాదించాడు. ఆ తర్వాత వైట్ రేంజర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే జాసన్ డేవిడ్ ఫ్రాంక్ ఆత్మహత్యకు గల సరైన కారణాలు ఏంటనేవి ఇంకా బయటకు రాలేదని, ప్రస్తుతం పోలీసు విచారణ కొనసాగుతుందని హాలీవుడ్ మీడియా సంస్థలు కథనాలు రాశాయి.

90వ దశకంలో ‘పవర్ రేంజర్’ సీరీస్‌కి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. గ్రీన్ రేంజర్, వైట్ రేంజర్ క్యారెక్టర్లలో నటించి ఎంతోమంది ప్రేక్షకాభిమానుల ఆదరణ దక్కించుకున్న జాసన్ మరణ వార్తను అభిమానులు నమ్మలేకపోతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్, హాలీవుడ్‌తో పాటు ప్రపంచ సినీ ప్రముఖులు జాసన్ డేవిడ్ ఫ్రాంక్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus