బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా జూన్ 16వ తేదీ ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషలలో విడుదలైంది. ఇలా ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయిందని చెప్పాలి.
ముఖ్యంగా ఇందులో కొన్ని డైలాగ్స్ అందరిని బాధ పెట్టడమే కాకుండా హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ పలువురు ఈ సినిమా గురించి ఈ సినిమాలోని డైలాగ్స్ గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ సినిమా విడుదల కాకముందు నుంచి పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటూ వచ్చింది.అలాగే ఈ సినిమాలో హనుమంతుడి డైలాగ్స్ హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ విమర్శలు రావడంతో డైలాగ్స్ కూడా మార్చారు.
ఇక అప్పటికే జరగాల్సిన భారీ నష్టం కూడా జరిగిపోయింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో కర్ణుడి పాత్రలో నటించిన నటుడు లావ్ పజ్నీ తాజాగా ఈ సినిమాలోని డైలాగ్స్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన నటీనటులు డైరెక్టర్ ఏది చెబితే అదే చేస్తాము.ఈ సినిమాని కొద్దికొద్ది భాగాలుగా చిత్రీకరించుకుంటూ పోయారు ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదని తెలిపారు.
ఇక (Adipurush) ఈ సినిమాలోని వివాదాస్పద సంభాషణలను తొలగించినప్పటికీ ఒక హిందువుగా ఆ డైలాగ్స్ విని నేను కూడా చాలా బాధపడ్డానని,ఆ డైలాగ్స్ నన్ను ఎంతో బాధించాయి అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలో నటించిన నటీనటులకే ఈ సినిమాలోని డైలాగ్స్ బాధపెట్టే అంశంగా ఉంటే మరి ప్రేక్షకులకు ఏ విధమైనటువంటి అనుభూతిని కలిగించుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.