Actor Naresh: నరేష్.. ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవుతారు

సీనియర్ నటుడు నరేష్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకో.. అందరికీ తెలుసు. సీనియర్ నటి పవిత్రను ఈయన పెళ్లి చేసుకోవాలి అనుకోవడం వల్ల. అందుకు పవిత్ర సిద్దమే. కానీ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఒప్పుకోవడం లేదు. ఆమె అభిప్రాయంతో కూడా పనిలేదు అన్నట్టు నరేష్, పవిత్ర వ్యవహరిస్తున్నారు అది వేరే సంగతి. అయినప్పటికీ రమ్య రఘుపతి లీగల్ గా నరేష్ కు విడాకులు ఇస్తేనే… నరేష్- పవిత్ర లు పెళ్లి చేసుకోవడం వీలవుతుంది.

సరే అది కూడా పక్కన పెట్టేద్దాం.. ! నరేష్ – పవిత్ర కలిసి ‘మళ్ళీ పెళ్లి’ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మే 26న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్లు కనుక గమనిస్తే.. నరేష్ – పవిత్ర – రమ్య రఘుపతి ల.. నిజజీవితాలను ఆధారం చేసుకునే.. ఈ చిత్రం తెరకెక్కినట్టు ఎవ్వరికైనా అర్థమవుతుంది. కానీ నరేష్.. మాత్రం అది వట్టి అపోహ.. సినిమా చూశాక మీరు ఆ మాట చెప్పండి అంటున్నాడు.

అయితే ‘మళ్ళీ పెళ్లి’ ట్రైలర్లో.. నరేష్ ను ‘వెయ్యి కోట్ల ఫిగర్ సార్ మీరు’ అంటూ ఓ వ్యక్తి అంటాడు. మొన్నామధ్య పవిత్ర లోకేష్ మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్.. ‘నరేష్ వద్ద ఉన్న రూ.1500 కోట్లు నొక్కేయడానికే పవిత్ర అతని వద్ద ఉంటుంది’ అంటూ ఓ ఘాటైన కామెంట్ చేశాడు. సో నరేష్… నిజంగానే అంత ఆస్తి కలిగి ఉన్నాడా? అనే అనుమానం అందరిలో ఉంది. అందులో చాలా వరకు నిజం ఉంది. కానీ నరేష్ కు ఉంది రూ.1000 కోట్లు, రూ.1500 కోట్లు కాదు ఏకంగా రూ.2000 కోట్లు.

అవును నరేష్ (Naresh) తండ్రి అంటే విజయ నిర్మల మొదటి భర్త కె.ఎస్.మూర్తి.. ఎప్పుడో చనిపోయారు.మూర్తి వారసుడు కాబట్టి.. అతని ఆస్తి నరేష్ కు దక్కింది. అలాగే విజయ నిర్మల గారు సంపాదించింది కూడా నరేష్ కే చెందింది. మరోపక్క అతను నటుడిగా కూడా బాగా సంపాదించాడు. ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. అందుకే 60 ఏళ్ళ వయసులో కూడా నరేష్ జల్సా రాయుడు లా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus