Actor Naresh: మూడో భార్యపై నరేష్ షాకింగ్ ఆరోపణలు!

హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశారు నరేష్. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. సీనియర్ నటి పవిత్రా లోకేష్ తో ఆయన రిలేషన్షిప్ లో ఉన్నారని.. ఆమెని సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలొస్తున్నాయి. తన మూడో భార్యకు విడాకులు ఇవ్వకుండా పవిత్రాను పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ వార్తల్లో నిజం లేదని అన్నారు నరేష్. పవిత్రా తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ఇక తన మూడో భార్య రమ్య రఘుపతి గురించి మాట్లాడుతూ ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె ముగ్గురు లేడీస్ తో కలిసి ఊటీ వెళ్లిందని.. ఆ సమయంలో తన దగ్గర పని చేసే ముస్లిం డ్రైవర్ తో ఆమె ఎఫైర్ ఉందని.. అతడు కూడా వాళ్లతో ఊటీకి వెళ్లాడని అన్నారు. అక్కడేదో తప్పు జరుగుతుందని..

పర్సనల్ టీమ్ ద్వారా తెలుసుకొని ఆమెని ప్రశ్నిస్తే.. ఏదేదో మాట్లాడిందని.. ఆ చండాలాన్ని మీడియా ముందు చెప్పలేనని అన్నారు. డ్రైవర్ కారణంగా ఆమె ఇబ్బంది పడుతుందని చెప్పి ఉంటే మరోలా ఉండేదని.. కానీ ఆమే ఎఫైర్ పెట్టుకుందని అన్నారు. అలానే ఇంట్లో ఓ పెళ్లి ఫంక్షన్ జరుగుతుండగా.. లేడీస్ పార్టీ కోసం ముంబైకి వెళ్లి మేల్ కేబరే డాన్సర్స్ ను తీసుకొచ్చిందని.. అసహ్యించుకొని చెప్పారు నరేష్. ఫుల్లుగా తాగేసి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించిందని అన్నారు.

తనవరకు తను చాలా క్లీన్ గా ఉంటానని.. తన పెళ్లిళ్ల విషయంలో తప్ప.. మరో రకంగా ఎప్పుడైనా వార్తల్లో నిలిచానా..? అని ప్రశ్నించారు నరేష్. తనపై ఎలాంటి సెక్సువల్ హెరాస్మెంట్ కేసులు కానీ ఆరోపణలు కానీ లేవని అన్నారు. తన మూడో భార్య కావాలనే తనను బద్నాం చేస్తుందని ఫైర్ అయ్యారు. ఆమె విషయంలో లీగల్ గా ప్రొసీడ్ అవుతాడని.. తన బిడ్డ కస్టడీ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus