Vijay Krishna: తండ్రి గురించి ఘోరంగా మాట్లాడిన విజయ్ కృష్ణ!

సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ కలిసి జీవిస్తున్న సంగతి తెలిసిందే. దాన్నే ఇంగ్లిష్ లో లివ్-ఇన్ రిలేషన్ షిప్ అంటారు. అయితే వీళ్లు కేవలం సహజీవనంలోనే ఉన్నారా? గుంభనంగా పెళ్లి కూడా చేసుకున్నారా? చాలామందికి కలిగిన సందేహం ఇది. ఇప్పుడీ ప్రశ్నకు తనదైన స్టయిల్ లో మళ్లీ పెళ్లి అంటూ సమాధానం ఇచ్చాడు నరేష్. అయితే ఇప్పుడు నరేష్ పై ఆయన కొడుకు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీకే నరేష్ కొడుకుగా అందరికీ పరిచయమే..

వాస్తవానికి నవీన్ విజయ్ కృష్ణకు బోలెడంత సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది.. అటు నానమ్మ విజయనిర్మల ,తండ్రి వికే నరేష్, తాత కృష్ణ ఇలా అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే.. కానీ ఈయనకు ఫలితం మాత్రం శూన్యం అనే చెప్పాలి. హీరోగా ఎనిమిదేళ్ల క్రితం ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.. కేవలం నాలుగు సినిమాలతో ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యాడు. ఇకపోతే సొంతంగా తానే సినిమా తీసుకోగలిగే సత్తా ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఆయన హీరోగా పనికి వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు.

ఇక నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీ కే కాదు అసలు కెమెరాకే కనిపించని ఈయన ఒక్కసారిగా మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా హిట్ అయిన కారణంగా ఒక పార్టీ నిర్వహించగా అందులో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. నవీన్ అవతారం చూసి టాలీవుడ్ మొత్తం షాక్ ఇగురైంది అసలు ఇతడు నవీన్ విజయ్ కృష్ణ అని గుర్తు పట్టడం ఎలా అని కూడా అందరూ ఆలోచించారు. బాగా బరువు పెరిగిపోయాడు..

అయితే నవీన్ విజయ్ కృష్ణ (Vijay Krishna) ఇంతలా బరువు పెరగడానికి కారణం కూడా లేకపోలేదు. ఆయన చాలా రోజులుగా ఇంటి నుంచి బయటకు రావడం లేదట తండ్రి నాలుగో పెళ్లి వ్యవహారం, మీడియాలో వరుస కథనాలు అతనిని బాగా డిస్టర్బ్ చేశాయి. పర్సనల్ లైఫ్ డిజాస్టర్ గా ఉన్న సమయంలో సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి ఎలా ఉంటుంది. పైగా తన తండ్రి మళ్ళీ పెళ్లి అనే సినిమాతో ఒక సినిమా చేస్తూ ఉండడం నిజంగా వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తుందట. ఇక తండ్రి చేస్తున్న పనుల వల్ల వారు హ్యాపీగా లేనట్టు తెలుస్తోంది.

అంతేకాదు తన తండ్రి హోటల్ రూమ్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం, సోషల్ మీడియా ముందు వెకిలి వేషాలు వేయడం వల్ల ఫ్యామిలీ పరువు కూడా పూర్తిగా పోయింది. ఇక ఈ వ్యవహారాలన్నీ కళ్లారా చూసిన కృష్ణ గారు కూడా ఈమధ్య కాలం చేశారు.. నరేష్ ప్రవర్తన ఎవరికి నచ్చకపోవడంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నవీన్ విజయకృష్ణ బయటకు రావడంలేదని సమాచారం అంతేకాదు వికే నరేష్ తన తండ్రి అని చెప్పుకోవడానికి కూడా ఆయనకు సిగ్గుగా ఉంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus