నటుడు నవీన్ రెడ్డిని ఫోర్జరీ కేసులో భాగంగా హైదరాబాద్ పోలీసులు గత రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈయన ఎన్ స్క్వేర్స్ కంపెనీలో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సమయంలో ఇతర డైరెక్టర్లకు తెలియకుండా సంతకాలను ఫోర్జరీ చేసి భారీగా స్కామ్ చేసినట్లు ఇతర డైరెక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఇతర డైరెక్టర్ల నుంచి ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు నటుడు నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని గత రెండు రోజులుగా విచారిస్తున్నారు.
అయితే ఈ విచారణలో భాగంగా నటుడు నవీన్ రెడ్డి ఫోర్జరీ చేసి మోసానికి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారు. ఈయన ఎన్ స్క్వేర్స్ కంపెనీకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్న సమయంలో ఇతరులకు తెలియకుండా ఫోర్జరీ సంతకాల ద్వారా సుమారు 55 కోట్ల స్కామ్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా డబ్బును స్కామ్ చేయడమే కాకుండా కంపెనీకి సంబంధించిన ఆస్తులను కూడా తన పేరుపై రాయించుకున్నట్టు సమాచారం.ఇలా భారీగా స్కామ్ చేసిన ఈ డబ్బుతో నవీన్ రెడ్డి పెద్ద ఎత్తున జల్సాలు చేయడమే కాకుండా
తానే హీరోగా నోబడీ అనే సినిమాని కూడా చేశారు. దీంతో ఇతర డైరెక్టర్లకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఎన్ స్క్వేర్ కంపెనీ డైరెక్టర్ల నుంచి ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు నటుడు నవీన్ రెడ్డి పై 420, 465,468,471 r/w 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా పోలీసులు నవీన్ రెడ్డిని విచారణ చేపట్టగా చివరికి నవీన్ రెడ్డి తాను ఫోర్జరీ చేసినట్లు నేరాన్ని అంగీకరించారు.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!