Prudhvi Raj: రాంబాబు vs శ్యాంబాబు… పృథ్వీ ఏమన్నారంటే?

‘బ్రో’ సినిమాతో ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపాటి పొలిటికల్‌ డిస్కషన్‌ నడుస్తోంది. అదే ‘రాంబాబు వర్సెస్‌ శ్యాంబాబు’. రాంబాబు అంటే ఏపీ మంత్రి అంబటి రాంబాబు అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక శ్యాంబాబు అంటే ‘బ్రో’ సినిమాలోని ఓ పాత్ర. అందులో పబ్‌లో ఈ పాత్ర ఉంటుంది. ఓ పాటలో స్టెప్‌ కూడా ఉంటుంది. ఆ డ్యాన్స్‌, మాటలు విని శ్యాంబాబు పాత్రను రాంబాబును విమర్శిస్తూ రూపొందించారు అని ఓ చర్చ మొదలైంది. దీనిపై ఇప్పటికే అంబటి రాంబాబు స్పందించారు. తాజాగా దానిపై శ్యాంబాబు పాత్రధారి పృథ్వీ మాట్లాడారు.

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. ఈ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అందులోని శ్యాంబాబు పాత్ర గురించి మాట్లాడుతూ ‘‘రాజకీయంగా తనను ఎదుర్కోలేక.. సినిమాల్లో తన క్యారెక్టర్‌ పెట్టి పవన్ కల్యాణ్‌ ఆనందపడుతున్నార’’ని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. వాటిపై శ్యాంబాబు మాట్లాడుతూ తాము ఎవరినీ ఇమిటేట్‌ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అంబటి రాంబాబును ఈ సినిమాలో ఇమిటేట్‌ చేశానంటున్నారు. ఆయన్ను ఇమిటేట్‌ చేయాల్సిన అవసరం లేదు.

అంతలా ఆయనను ఇమిటేట్‌ చేయడానికి ఆయనేమైనా ఆస్కార్‌ నటుడా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఓ పనికిరాని దద్దమ్మ తన బాధ్యతలన్నీ వదిలేసి క్లబ్బులు, అమ్మాయిల వెంట తిరుగుతుంటాడు. ఆ పాత్ర పేరే శ్యాంబాబు. అంతేకానీ అంబటి రాంబాబు పాత్ర చేయాల్సిన అవసరం నాకు కానీ మా టీమ్‌కు కానీ లేదు. పవన్‌ కల్యాణ్‌కి కూడా ఆ ఉద్దేశం లేదు. అంతేకాదు ఈ సినిమాలో శ్యాంబాబు ఆ డ్యాన్స్‌ రాంబాబులా ఉందని వారు అనుకుంటున్నారేమో కానీ, మేము అనుకోవటం లేదు.

మా కన్నా రాంబాబు గొప్పగా డ్యాన్స్‌ చేశారు అని అన్నారు. మా శ్యాంబాబు డ్యాన్స్‌ వేరు.. రాంబాబు డ్యాన్స్‌ వేరు. మంత్రిగారిని కించపరుస్తున్నారని అంటున్నారు కానీ… పవన్‌ కల్యాణ్‌ను మంత్రి జోగి రమేశ్‌ అసభ్యంగా మాట్లాడారు. దానిని కించపరడచం అంటారు అని క్లారిటీ ఇచ్చారు (Prudhvi Raj) పృథ్వీ.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus