Rakesh Varre: ‘బాహుబలి’ ఫేమ్ రాకేష్ వర్రె అగ్రెసివ్ కామెంట్స్ వైరల్!

రాకేష్ వర్రె (Rakesh Varre) .. ఈ పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టడం కష్టం.కానీ ‘బాహుబలి 2’ (Baahubali 2) సినిమాలో నిండు సభలో ప్రభాస్ తో తల నరికించుకున్న నటుడు అంటే.. మైండ్లోకి ఇతని ఫేస్ వచ్చేస్తుంది. అంతకు ముందు ఇతను ‘జోష్’ (Josh) ‘మిర్చి’ (Mirchi) ‘బద్రీనాథ్’ (Badrinath) ‘గూఢచారి’ (Goodachari) వంటి సినిమాల్లో కూడా నటించాడు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. తర్వాత హీరోగా, నిర్మాతగా కూడా మారి ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే సినిమా చేశాడు. అది మంచి టాక్ తెచ్చుకుంది.

Rakesh Varre

కానీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘పేక మేడలు’ (Pekamedalu) అనే సినిమాను నిర్మించాడు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాకు మంచి టాక్ వచ్చింది. క్రిటిక్స్ కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు. కానీ అది కూడా బాక్సాఫీస్ వద్ద అది నిలబడలేదు. అయితే ‘పేక మేడలు’ తో రాకేష్ వర్రె టాలెంటెడ్ అని, కంటెంట్ పై అతనికి మంచి టేస్ట్ ఉంది అని అందరికీ తెలిసొచ్చింది.

ఇతను హీరోగా తెరకెక్కిన ‘జితేందర్ రెడ్డి’ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో రాకేష్ వర్రె అగ్రెసివ్ గా మాట్లాడాడు.’నా కెరీర్లో నేను చేసిన అతిపెద్ద తప్పు ‘పేక మేడలు’ అనే సినిమా చేయడం. హీరోగా ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే సినిమా చేశాను. అది సక్సెస్ అయ్యింది. కానీ నాకు మార్కెట్ ఏర్పడలేదు.

అందువల్ల నేను ఒకటి డిసైడ్ అయ్యాను. ముందుగా నేను క్లిక్ అయిన తర్వాత, నాకు మార్కెట్ వచ్చాకే నేను కొత్తవాళ్లను పరిచయం చేస్తాను. ‘పేక మేడలు’ అనే సినిమాని బయటకు తీసుకురావడానికి మాకు 3 ఏళ్ళు టైమ్ పట్టింది. వేరే పెద్ద నిర్మాత అయితే దానిని ఏడాదిన్నరలో బయటకు తీసుకొచ్చేవాడు. ఆ సినిమా వల్ల నాకు మా డైరెక్టర్ కి ఏడాదిన్నర టైమ్ వేస్ట్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు రాకేష్ వర్రె.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus