బాహుబలి, బాహుబలి2 సినిమాల ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాల్లో కట్టప్పగా సత్యరాజ్ పేరు సంపాదించుకున్నారు. సత్యరాజ్ కు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు. సత్యరాజ్ ను అభిమానించే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలుగు సినీ అభిమానులు సత్యరాజ్ ను కట్టప్పగా చూడటానికే ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో సత్యరాజ్ కొన్ని సినిమాలలో విలన్ రోల్స్ లో నటించి మెప్పించారు. తమిళంలో విలన్ రోల్స్ ద్వారా గుర్తింపు వచ్చిన తర్వాత హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన సత్యరాజ్ కొంతకాలం పాటు స్టార్ హీరోగా కెరీర్ ను కొనసాగించి
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. సత్యరాజ్ అసలు పేరు రంగరాజ్ కాగా తాజాగా ఆయన 70వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. సట్టం ఎన్ కైయిల్ సినిమాతో నటుడిగా సత్యరాజ్ సినీ కెరీర్ మొదలైంది. సావి అనే సినిమాలో సత్యరాజ్ తొలిసారి హీరోగా నటించారు. సత్యరాజ్ నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. తెలుగులో మిర్చి సినిమా కూడా సత్యరాజ్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. సత్యరాజ్ ఆస్తుల విలువ 70 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది.
సత్యరాజ్ (Sathyaraj) రెమ్యునరేషన్ రోజుకు 8 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతుండటం గమనార్హం. సత్యరాజ్ దగ్గర ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. సత్యరాజ్ కు సొంతంగా నాగమ్మాల్ అనే మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ఉంది. సత్యరాజ్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సత్యరాజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో సత్యరాజ్ కు మరిన్ని భారీ విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది. సత్యరాజ్ మంచి కథలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.