Actor Sriram: ఆ నిర్మాత వల్ల హీరోయిన్ కూడా పారిపోయింది : నటుడు శ్రీరామ్

హీరో శ్రీరామ్ తమిళ సినిమా ‘రోజా కూటం’తో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాను ‘రోజా పూలు’గా తెలుగులోకి అనువాదం చేశారు. భూమిక హీరోయిన్ కావడంతో ఈ సినిమా తెలుగువారికి బాగా రీచ్ అయ్యింది. అయితే, సినిమా చూశాక అందరూ హీరో శ్రీరామ్ గురించి మాట్లాడుకున్నారు. తెలుగబ్బాయే అంట కదా అని ఆరాలు తీశారు. ఆ తర్వాత ‘ఒకరికి ఒకరు’ అనే సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేశారు శ్రీరామ్. ఈ సినిమా అప్పట్లో మంచి మ్యూజికల్ హిట్.

ప్రస్తుతం అవకాశాలు లేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యాడు శ్రీరామ్. తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. తన డెబ్యూ మూవీ ‘రోజా పూలు’ అనుభవాలను గుర్తుచేసుకున్నాడు శ్రీరామ్. ఆ సినిమా షూటింగ్ రెండేళ్లు జరిగిందని, ఎనిమిదిసార్లు ఆగిందని చెప్పుకొచ్చారు. ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎప్పుడు గొడవపడతారో అని భయపెడుతూ ఉండేవాడట శ్రీరామ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా భూమిక నటించిన విషయం తెలిసిందే..

అయితే సినిమా విడుదలకు రెండు వారాలు ఉంది అనగా.. పాట పూర్తి చేయమని నిర్మాత చెప్పాడట. అది నచ్చక భూమిక పారిపోయిందని సంచలన నిజాలు బయటపెట్టాడు. అయినా కూడా ఆ పాట సూపర్ సక్సెస్‌ఫుల్ అని గుర్తుచేసుకున్నాడు. శ్రీ రామ్ తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సినిమాలో వెంకటేష్ ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు. దడ, నిప్పు, లై, రావణాసుర వంటి సినిమాల్లో కూడా ఈ నటుడు (Actor Sriram) యాక్ట్ చేసి మెప్పించాడు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus