అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వంటి స్టార్ల గట్టి పోటీ ఇచ్చారు సుమన్. అంతే కాదు నెంబర్ వన్ హీరో కోసం సుమన్.. మిగిలిన హీరోలకి గట్టి పోటీ ఇచ్చేవారు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు సౌత్ ఇండియాలో అన్ని బాషల చిత్రాల్లోనూ నటించారు సుమన్. అలాంటి సుమన్ కి రజినీకాంత్ నటించిన `శివాజీ` చిత్రం తర్వాత ఆ రేంజ్ పాత్ర దక్కలేదనే చెప్పాలి. ఇదే ప్రశ్న సుమన్ ని అడుగగా… “శివాజీ సినిమా వేరు.. ఆ గ్రాండియారిటీ వేరు. శివాజీ చూసినప్పుడు సుమన్ విలన్ ఏంటి? అన్నారు. అన్నమయ్య చేసినప్పుడు కూడా సుమన్ వెంకటేశ్వర స్వామి ఏంటి? అన్నారు. ఆ తర్వాత అలా అన్న వాళ్ళే పొగిడారు కూడా. ఒక స్థాయికి వచ్చాక మాకు ట్యాలెంట్ నిరూపించుకునేలా మంచి పాత్రల్ని దర్శకులు డిజైన్ చేయాలి. అలాంటి వాటినే నేను కూడా అడుగుతాను” అంటూ సమాధానమిచ్చారు.
ఇక ఈ జనరేషన్ దర్శకులు విలనిజాన్ని అంత బాగా చూపించరు.. అనేది మీ ఉద్దేశమా అనే ప్రశ్నకు సుమన్ బదులిస్తూ.. `”రాజమౌళిని చూడండి. ఆయన ఈ జనరేషన్ డైరెక్టర్. విలన్ కి ఎంతటి పవర్ ని ఇస్తున్నారో“ అంటూ ప్రశంసలు కురిపించారు. ‘బాహుబలి’ చిత్రంలో లో ప్రభాస్ కాదు రానా నిజమైన హీరో. చివరిలో రానా ఫైర్ లో పడిపోతాడు కానీ ప్రభాస్ ఎక్కడా తనని తోసేయడు. తనే బ్యాలెన్స్ తప్పి పడిపోతాడు. చచ్చే వరకూ అతడు పవర్ ఫుల్. ప్రభాస్ ఎక్కడా టచ్ చేయడు. అంటే విలన్ చచ్చే వరకూ ఫవర్ ఫుల్ అని చూపించాడు రాజమౌళి. ఇది కేవలం రాజమౌళి వలనే సాధ్యం. ‘ఈగ’ సినిమాలో సైతం డిఫరెంట్ విలనిజం చూపించారు. ఆ విలన్ ఈగతో ఫైట్ చేయడం అన్నది క్రియేట్ చేయడం చాలా కష్టమైన అంశం. విలన్ కి కథలో ఎవరు.. ఎంత ప్రాముఖ్యతనిస్తారో ఆ సినిమానే సక్సెస్ అవుతుంది. ఏదో 20 మందిని కొట్టేయడం గాల్లో ఎగరేయడం ఇవన్నీ చూపిస్తున్నారు ఇప్పటి డైరెక్టర్లు. ఇంటెలెక్చువల్ గా ఎలా కొట్టాలి? అన్నది రాజమౌళి మాత్రమే చూపించారు. విలన్ గా అలాంటి పవర్ ఫుల్ పాత్రలు ఇస్తే నేను కూడా చేస్తాను. రొటీన్ గా రేప్ లు చేయడం బ్యాంక్ దోచేయడం వంటి విలనిజాన్ని రాజమౌళి చూపించరు” అంటూ మన జక్కన్నను ఆకాశానికి ఎత్తేసారు సుమన్. మరి ‘శివాజీ’ లాంటి విలన్ రోల్ ని రాజమౌళి సుమన్ కి ఇస్తాడేమో చూడాలి..!