Suman: రెమ్యునరేషన్లపై సుమన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • August 1, 2022 / 07:04 AM IST

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాల గురించి జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు అంతకంతకూ పెరుగుతుండటం వల్లే నిర్మాతలు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన సుమన్ తాజాగా రెమ్యునరేషన్ల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆగష్టు నెల 1వ తేదీ నుంచి టాలీవుడ్ సినిమాల షూటింగ్ లు బంద్ కానున్నాయి. షూటింగ్ ల బంద్ గురించి సుమన్ స్పందిస్తూ సినిమా షూటింగ్ ల బంద్ నిర్ణయం సరికాదని అన్నారు.

మంచి కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయని సుమన్ చెప్పుకొచ్చారు. షూటింగ్ లను బంద్ చేసినంత మాత్రాన ఓటీటీలపై ఆ ప్రభావం పడదని సుమన్ తెలిపారు. హీరోల రెమ్యునరేషన్లను వివాదం చేయడం సరికాదని ఆయన తెలిపారు. ఓటీటీ సినిమాల సెన్సార్ పై దృష్టి పెడితే మంచిదని ఆయన చెప్పుకొచ్చారు. హీరోల రెమ్యునరేషన్లను తగ్గించాలని కోరడం కరెక్ట్ కాదని సుమన్ పేర్కొన్నారు. హీరోలకు ఉన్న ఆదరణ ఆధారంగా పారితోషికాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

నిర్మాతలు షూటింగ్ ల సమయాన్ని పెంచుకుంటే బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అవసరాలకు అనుగుణంగా కాల్షీట్లు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నిర్మాతలు బయ్యర్లకు నష్టం లేకుండా చూసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలకు నష్టాలు వచ్చిన సమయంలో తమిళనాడు రాష్ట్రంలో రజనీకాంత్ పారితోషికాన్ని వెనక్కిచ్చారని అలాంటి ఉదారత ఇక్కడ కూడా ఉంటే మంచిదని సుమన్ తెలిపారు.

షూటింగ్ లను బంద్ చేయడం వల్ల నిర్మాతలకు ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో చూడాల్సి ఉంది. ఈ విధంగా చేయడం వల్ల సినీ కార్మికుల జీతాలు తగ్గే ఛాన్స్ కూడా ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఇప్పటికే కొందరు హీరోలు రెమ్యునరేషన్లను తగ్గించుకోవడానికి సిద్ధపడ్డారు. మరి కొందరు హీరోలు కూడా పారితోషికాలు తగ్గించుకుంటే మాత్రమే ఇండస్ట్రీ పరిస్థితులు మారే ఛాన్స్ ఉంటుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus