టాలీవుడ్ పరిస్థితి గురించి ప్రముఖ నటుడు సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నటీనటులు, నిర్మాతలు, బయ్యర్లు.. ఇలా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి. ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు అనేది తెలియదు కానీ, టాలీవుడ్ పరిస్థితి అయితే అంత ఆరోగ్యకరంగా లేదని చెప్పారు. ఇంతకీ సుమన్ ఏమన్నారంటే… తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వాతావరణం ఆరోగ్యకరంగా లేదు, సినిమాలు కొనే బయ్యర్లు తీవ్రంగా నష్టపోతున్నారని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్ర పరిశ్రమలోని పెద్దలు ఇప్పటికైనా దృష్టి సారించి బయ్యర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారాయన. ఇండస్ట్రీలో సమయపాలన లేకపోవడం వల్ల నటీనటులు, నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా కామెంట్ చేశారు సుమన్. అంతేకాదు కన్నడ చిత్ర పరిశ్రమ తరహాలో తెలుగు సినీ పరిశ్రమలోని నిబంధనలను సవరించాలని కూడా సూచించారు. దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా భారత్ ఆర్ట్స్ అకాడమీ, వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంయుక్తంగా ‘దాసరి ఫిల్మ్ అవార్డ్స్’ను ప్రదానం చేశాయి.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుమన్ ఇండస్ట్రీపై ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితిపై ప్రశ్నలు రేగుతున్నాయి. నిజంగా సుమన్ చెప్పినట్లు టాలీవుడ్ సిట్యువేషన్ అంత బాగోలేదా అనేది ఆలోచించాల్సిన విషయమే. పాన్ ఇండియా సినిమాలు తప్ప సాధారణ సినిమాలకు విజయం సరిగ్గా దక్కడం లేదు. దీంతో బయ్యర్లు ఇబ్బందుల్లో ఉన్నారు. మరోవైపు చిన్న సినిమాలకు కూడా సరైన విజయం దక్కడం లేదు.
వచ్చినా అరకొర విజయాలే. ఇలాంటి సమయంలో బయ్యర్ల గురించి ఆలోచించాల్సిన విషయం ఉందని టాలీవుడ్ పరిశీలకలు అంటున్నారు. ఇప్పుడు నటుడు సుమన్ కూడా ఇదే తరహాలో మాట్లాడటంతో టాలీవుడ్ గురించి మరోసారి చర్చ మొదలవుతుంది అనడంతో సందేహం లేదు. మరి నిర్మాతలు, నటులు కూర్చొని దీనిపై ఏదైనా చర్చ పెడతారేమో చూడాలి. మొన్నీమధ్య హీరోల పారితోషికం తగ్గించుకోవాలి అనే చర్చ కూడా జరిగినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు బయ్యర్లు, టైమ్‌సెన్స్‌పై చర్చ జరుగుతుందా?
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!