ఈరోజు నుండి అంటే ఆగస్టు 1 నుండి షూటింగ్లు బంద్ చేస్తూ ఫిలిం ఛాంబర్ తో కలిసి టాలీవుడ్ నిర్మాతలు తీసుకున్న నిర్ణయం పై హీరో సుమన్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకున్న తర్వాత షూటింగ్స్ తిరిగి ప్రారంభించేది ప్రకటిస్తామని వారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై సీనియర్ హీరో, సహాయ నటుడు అయిన సుమన్ మాట్లాడుతూ.. “షూటింగులు బంద్ అనేది సరైన నిర్ణయం కాదు.దీని వల్ల ఓటీటీలకు వచ్చిన ఇబ్బంది లేదు.
కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.అయితే ఓటీటీ సినిమాల సెన్సార్ పై దృష్టి పెడితే బాగుంటుంది. అంతేకాకుండా హీరోల రెమ్యూనరేషన్స్ గురించి చర్చలు అనవసరం. అందరు హీరోలు రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాలి అనడం కరెక్ట్ కాదు. ఇండస్ట్రీలో మా ఫ్యామిలీస్ అని చెప్పుకు తిరిగే వాళ్ళు పారితోషికాలను తగ్గించుకోవాలని సుమన్ వ్యంగ్యంగా స్పందించారు. హీరోలకు ఉన్న ఇమేజ్ ను బట్టి నిర్మాతలు పారితోషికాలు చెల్లిస్తారు. వాళ్ళను బట్టే జనాలు థియేటర్లకు వస్తారు.
కాబట్టి వాళ్ళు పారితోషికాలు తక్కువ చేసుకోవాలి అంటే అది తప్పు అవుతుంది. నిర్మాతలు షూటింగ్‌ల సమయాన్ని పెంచుకోవాలి. అవసరాన్ని మించి కాల్షీట్లు తీసుకోవడం అనవసరం.మేకింగ్ కాస్ట్ పెరిగిపోవడం.. దాని వల్ల ఆ భారాన్ని బయ్యర్ల నెత్తిన పారేయడం అనేది కరెక్ట్ కాదు. బయ్యర్స్ బాగుండాలి అని నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవాలి.
కోలీవుడ్ లో సినిమాలకు నష్టాలు వస్తే రజనీకాంత్ వంటి స్టార్ హీరోలు రెమ్యూనరేషన్స్ తిరిగి ఇచ్చేస్తారు. అటువంటి ఉదారత ఇక్కడ కూడా ఉంటే మంచిదే. కానీ అలా చేయమని ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు” అంటూ సుమన్ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?