సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఎంత మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. అయితే నటీనటులు లేదంటే దర్శకనిర్మాతలు లేదా ఇతర టెక్నీషియన్లు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. టాలీవుడ్లో అనే కాదు ఇతర సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొంతమంది వయసు సంబంధిత సమస్యలతో.. ఇంకొంతమంది అనారోగ్య సమస్యలతో ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు.
వివరాల్లోకి వెళితే… మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు విష్ణుప్రసాద్ (Vishnu Prasad) ఈరోజు మృతి చెందారు. కొన్నాళ్ల నుండి కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన కేరళ, ఎర్నాకులంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే పరిస్థితి విషమించడం, చికిత్స కొరకు మరింతగా డబ్బులు ఖర్చు అవుతూ ఉండటం వల్ల.. అతని ఫ్యామిలీ ఫండ్ రైజింగ్ ను ఆశ్రయించింది. కానీ ఇంతలోనే విష్ణు ప్రసాద్ మరణించారు.
దీంతో వారి ఫ్యామిలీలోనే కాకుండా మలయాళ ఇండస్ట్రీ మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి అని చెప్పాలి. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కొంతమంది సినీ పెద్దలు, అతన్ని అభిమానించేవారు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక విష్ణుప్రసాద్ (Vishnu Prasad) ‘కాశీ’ అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. తర్వాత ‘రన్ వే’ ‘లయన్’ ‘బెన్ జాన్సన్’ ‘కాయ్ ఎతుమ్ ధూర్త్’ ‘లోకనాథ్ ఐఏఎస్’ వంటి సినిమాల్లో కూడా నటించి పాపులర్ అయ్యారు.