బుల్లితెర పై సూపర్ సక్సెస్ సాధించిన జబర్దస్త్, పటాస్ కామెడీ షోలు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ షోలో పార్టిసిపేట్ చేసిన చాలామంది సినిమాల్లో బిజీగా రాణిస్తున్నారు. మరోపక్క బుల్లితెర పై కూడా వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నారు. ఇందులో యాదమ రాజు కూడా ఒకరు. పటాస్ షో ద్వారా ఇతను బాగా ఫేమస్ అయ్యాడు. ఓ స్టూడెంట్ గా ఈ షోలో అడుగుపెట్టి .. ఇతను వేసిన జోక్ లు బాగా పేలడంతో .. వెంటనే పార్టిసిపెంట్ గా కూడా అవకాశం దక్కించుకున్నాడు.
ఆ తర్వాత వరుస షోలు దక్కించుకున్నాడు. ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. చాలా రోజులుగా ఇతను స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ కలిసి యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తున్నారు. ఇక తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. త్వరలోనే వీళ్ళ పెళ్లి జరుగబోతోంది. వీళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి: