Aishwarya Rai: హీరోయిన్ ఐశ్వర్యారాయ్ ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన ఐశ్వర్యారాయ్ ఈ మధ్య కాలంలో మళ్లీ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్ వయస్సు 49 సంవత్సరాలు కాగా ఆమె ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తూ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఐశ్వర్యారాయ్ కు మరో పదేళ్ల పాటు అవకాశాల విషయంలో ఢోకా లేదని కొంతమంది కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ స్టార్ హీరోయిన్ నికర ఆస్తుల విలువ 776 కోట్ల రూపాయలు అని సమాచారం.

పొన్నియిన్ సెల్వన్2 సినిమాతో మరో భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్న ఐశ్వర్యారాయ్ ఆస్తుల విలువ తెలిసి నెటిజన్లు సైతం ఒకింత షాకవుతున్నారు. దుస్తుల విషయంలో ఐశ్వర్యారాయ్ స్పెషల్ కేర్ తీసుకుంటారనే సంగతి తెలిసిందే. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఐశ్వర్యారాయ్ కు ఖరీదైన ప్రాపర్టీలు ఉన్నాయి. ఐశ్వర్యారాయ్ దగ్గర ఉన్న కార్ల విషయానికి వస్తే ఆమె దగ్గర ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు ఉండటంతో పాటు ఆడి ఏ8 ఎల్ కారు కూడా ఉంది.

పలు ప్రముఖ సంస్థల ఉత్పత్తులకు ఐశ్వర్యారాయ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. ఒక్కో సినిమాకు ఐశ్వర్యారాయ్ 10 కోట్ల రూపాయల నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. రాబోయే రోజుల్లో ఐశ్వర్యా రాయ్ రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఎంతోమంది హీరోయిన్లకు ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు.

పెళ్లి తర్వాత అభినయ ప్రధాన పాత్రల్లో (Aishwarya Rai) ఆమె ఎక్కువగా నటిస్తున్నారు. ఐశ్వర్యారాయ్ తన టాలెంట్ వల్లే ఈ స్థాయికి ఎదిగారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఐశ్వర్యారాయ్ సౌత్ సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మరి కొందరు చెబుతున్నారు. ఐశ్వర్యారాయ్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus