ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు వచ్చేసి మనం బాలీవుడ్ వెళ్లి విజయాలు సాధించి వస్తున్నాం కానీ.. ఒకప్పుడు దేశవ్యాప్తంగా విడుదలై మంచి విజయాలు అందుకున్న సినిమాలు అంటే బాలీవుడ్ సినిమాలే అని చెప్పాలి. అలా 23 ఏళ్ల క్రితం వచ్చిన ఓ సినిమా గురించి, అందులో హీరోయిన్ పాత్ర ఎంపిక గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ విషయాలు చెప్పింది కూడా ఆ సినిమాలో నటించిన హీరోయినే.
‘కహోనా ప్యార్ హై’… ఈ సినిమా రెండు దశాబ్దాల క్రితం వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజుల్లో ఈ సినిమా ఓ ఎమోషన్ అని చెప్పొచ్చు. సినిమాలో మాటలు, పాటలు అర్థం కాకపోయినా దేశవ్యాప్తంగా కుర్రకారు తెగ చూసేశారు. ఎందుకంటే అందులో హీరో, హీరోయిన్, పాటలు, కెమిస్ట్రీ, ఎమోషన్ అంతలా ఉంటాయి కాబట్టి. హృతిక్ రోషన్ తొలి సినిమా తెరకెక్కిన ఈ చిత్రంలో అమీషా పటేల్ కథానాయిక. అయితే ఆ అవకాశం తొలుత వచ్చింది కరీనా కపూర్‌కి అట.
హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ తెరకెక్కించిన ‘కహోనా ప్యార్ హై’ సినిమా 2000లో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హృతిక్‌కి బాలీవుడ్ గ్రీక్‌గాడ్ అనే పేరు వచ్చేసింది. అమీషాకి అయితే వరుస అవకాలు వచ్చేశాయి. అయితే తొలుత ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా కరీనా కపూర్‌ను అనుకున్నారట. అయితే కొన్ని పరిస్థితుల్లో కరీనాను తప్పించి తనను తీసుకున్నారని అమీషా పటేల్ చెప్పుకొచ్చింది. ‘కహోనా ప్యార్ హై’ సినిమా కథ కరీనా కపూర్‌కు ఈ కథ ఎంతో నచ్చిందట.
అయితే సినిమా ప్రారంభం అయిన తొలి రోజుల్లో రాకేశ్ రోషన్‌తో (Actress) ఆమెకు విభేదాలు తలెత్తాయట. దాంతో సినిమా నుండి వెళ్లిపొమ్మని ఆమెకు చెప్పారట. అలా కరీనా సినిమా నుండి బయటకు వెళ్లిపోయిందట. ఈ విషయాన్ని రాకేశ్ సతీమణి తనతో చెప్పారని అమీషా చెప్పుకొచ్చింది. తనను ఓ పెళ్లిలో చూసి ఈ సినిమా అవకాశం ఇచ్చారని తెలిపింది. ఎలాంటి ట్రైనింగ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను అని కూడా చెప్పింది అమీషా.
మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!
సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!