Ananya Nagalla: వేణు స్వామితో మీటింగ్.. క్లారిటీ ఇచ్చేసిన అనన్య నాగళ్ళ..!
- November 7, 2024 / 01:13 PM ISTByFilmy Focus
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అచ్చ తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. వారిలో అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఒకరు. తెలంగాణలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ ‘మల్లేశం’ (Mallesham) తో సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చేసిన ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.అలాగే ‘శాకుంతలం’ (Shaakuntalam), ‘మ్యాస్ట్రో’ (Maestro) వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ అలరించింది. రీసెంట్‌గా ‘పొట్టేల్’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే మెప్పించింది.
Ananya Nagalla

తెలంగాణ సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపించే ఈ మూవీలో బుజ్జమ్మ పాత్రలో క్యూట్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది అనన్య. ఈ సినిమా కంటే ముందు హారర్ మూవీ ‘తంత్ర’లో (Tantra) నటించి భయపెట్టింది. క్షుద్ర పూజల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా 2024, మార్చి 15న విడుదలైంది. ఈ సినిమా విడుదల టైంలో అనన్య ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామిని కలిసింది. వేణు స్వామితో కలిసి దిగిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
‘ఈ క్యూట్ బ్యూటీ వేణు స్వామిని ఎందుకు కలిసి ఉంటుంది?’ అనే కోణంలో చాలా చర్చ కూడా జరిగింది. అయితే తాజాగా ఈ విషయం గురించి స్పందిస్తూ వేణు స్వామిని కలవడానికి గల కారణం ఏంటో చెప్పింది అనన్య. అనన్య కంటే ముందు డింపుల్ హయాతి (Dimple Hayathi) , రష్మిక (Rashmika Mandanna) , నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) వేణు స్వామిని స్వయంగా కలిసి ఆయనతో పూజలు చేయించుకున్నారు. బిగ్‌బాస్ ఫేమ్ అషూ రెడ్డి (Ashu Reddy) సైతం వేణు స్వామిని కలవడం జరిగింది. అనన్య మాత్రం ఎలాంటి పూజలు చేయించుకోలేదని స్పష్టం చేసింది.

అనన్య మాట్లాడుతూ… ‘సినీ రంగంలో సక్సెస్ అవ్వాలంటే ప్రతిభ ఉంటే చాలదు, అదృష్టమూ ఉండాలి. కానీ నేను ఎప్పుడూ, ఎవరి దగ్గర జాతకాలు చెప్పించుకోలేదు, చిన్నప్పటి నుంచి జాతకాలపై నమ్మకం లేదు. ‘తంత్ర’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేను స్వామి దగ్గరికి వెళ్లా, జాతకాన్ని చూపించుకోవడానికి కాదు. ఆయన్ను మూవీ ప్రమోషన్ లో భాగంగా కలిశాను, అంతే తప్ప ఎలాంటి పూజలూ చేయించుకోలేదు.” అంటూ క్లారిటీ ఇచ్చింది.













