కొన్నాళ్లుగా డిసెంబర్ చివర్లో వచ్చే సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తున్నాయి. క్రిస్మస్ టు న్యూ ఇయర్.. టైమ్లో హాలిడేస్ ఉంటాయి. కాబట్టి..ఈ టైమ్లో థియేటర్లకు వెళ్ళడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతుంటారు. కోవిడ్ తర్వాత చూసుకుంటే..2020 లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) , 2021 లో ‘పుష్ప’ (Pushpa) ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy), 2022 లో ‘ధమాకా’ (Dhamaka) , 2023 లో ‘సలార్’ (Salaar) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేశాయి.
Robin Hood
కానీ దర్శక నిర్మాతలు ఎక్కువగా సంక్రాంతి సీజన్ పైనే గురిపెడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. డిసెంబర్ చివర్లో రిలీజ్ అయ్యే సినిమాలకి పాన్ ఇండియా వైడ్ సక్సెస్ సాధించే అడ్వాంటేజ్ కూడా ఉంది. అయితే ఈ ఏడాది డిసెంబర్లో పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు. నితిన్ (Nithiin) , దర్శకుడు వెంకీ కుడుముల(Venky Kudumula) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాబిన్ హుడ్’ (Robinhood) రిలీజ్ అవుతుంది అంటున్నారు. కానీ చిత్ర బృందం ఇంకా బలంగా చెప్పడం లేదు.
ఆ సినిమా నిర్మాతలు ఎక్కువగా ‘పుష్ప 2’ (Pushpa 2) పైనే ఫోకస్ చేస్తున్నారు. అదే డేట్ కి ‘తండేల్’ (Thandel) ని విడుదల చేద్దామని అల్లు అరవింద్ (Allu Aravind) అనుకున్నట్టు చెప్పారు. కానీ వెనక్కి తగ్గారు. ‘ముఫాసా-ది లయన్’ కింగ్ వస్తుందని భయపడుతున్నారో ఏమో కానీ.. మంచి సీజన్ ని టాలీవుడ్ దర్శక నిర్మాతలు వదిలేస్తున్నారు అనే చెప్పాలి. ప్రియదర్శి (Priyadarshi ) ‘సారంగపాణి జాతకం’, రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ‘శారీ’ వంటి ఇంట్రెస్ట్ లేని చిన్న చితక సినిమాలతోనే 2024 కి గుడ్ బై చెప్పాల్సి వస్తుందేమో.