Anjali: సినిమాల ద్వారా అంజలి అంత మాత్రమే సంపాదించిందా?

తెలుగు, తమిళ భాషల్లోని సినిమాలలో నటించి హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన వాళ్లలో అంజలి ఒకరనే సంగతి తెలిసిందే. తను నటించిన సినిమాల ద్వారా అంజలి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. తమిళంలో కూడా ఆమె నటించిన సినిమాలు సక్సెస్ సాధించాయి. హీరోయిన్ గా అంజలికి ఆఫర్లు తగ్గడంతో ఆమె స్పెషల్ రోల్స్ చేయడంతో పాటు స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా ఓకే చెబుతుండటం గమనార్హం. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అంజలి ఇండస్ట్రీలో ఉన్నా ఆమె ఎక్కువమొత్తంలో ఆస్తులు సంపాదించలేదని సమాచారం అందుతోంది.

చెన్నై, హైదరాబాద్ లో అంజలి సంపాదించిన మొత్తం ఆస్తుల విలువ కేవలం 10 కోట్ల రూపాయలు అని సమాచారం. స్టార్ హీరోల సినిమాలలో ఎక్కువగా ఆఫర్లు రాకపోవడం వల్లే అంజలి ఆస్తులు భారీగా పెరగలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో ఆస్తులకు సంబంధించిన పలు వివాదాల ద్వారా అంజలి వార్తల్లో నిలిచారు. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్తుల విషయంలో మోసం చేశారని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో అంజలి కొంతమేర ఆస్తులు పోగొట్టుకుని ఉండవచ్చని చాలామంది భావిస్తున్నారు.

వైరల్ అవుతున్న వార్తల గురించి అంజలి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. గతేడాది వకీల్ సాబ్ తో అంజలి ఖాతాలో హిట్ చేరింది. ఈ ఏడాది మాచర్ల నియోజకవర్గం సినిమాలో అంజలి స్పెషల్ సాంగ్ చేసినా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడం అంజలికి మైనస్ అయింది.

ప్రస్తుతం అంజలి ఒక్కో ప్రాజెక్ట్ కు కోటి రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. అంజలి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అంజలి ప్రస్తుతం చరణ్ శంకర్ కాంబో మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అంజలి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus