కేవలం బర్గర్లు తినే పాత్రలు మాత్రమే నీకు వస్తాయి!

టైటిల్ చూసి హీరోయిన్ అంజ‌లికి ఘోర అవ‌మానం ఏంట‌నుకుంటున్నారా ? ఆ అంజ‌లి మ‌న తెలుగు హీరోయిన్ అంజ‌లి కాదు. త్రిబుల్ ఆర్ భామ ఆలియా భట్, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ కపూర్ జంటగా నటించిన సినిమా రాఖీ రాణి కి ప్రేమ కహాని. ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళుతుంది. రిలీజ్ అయిన 8 రోజుల్లోనే ఈ సినిమా రు. 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించారు ఈ సినిమాలో హీరో రణవీర్ సోదరిగా తనదైన నటనతో అందర్నీ ఆకర్షించింది. బుల్లితెర నటి అంజలి ఆనంద్ సోదరి గాయత్రి పాత్రలో కనిపించినా ఆమె పాత్రకు ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె తన తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అవమానాలు గురించి వెల్లడించింది. కెరీర్ ప్రారంభంలోనే తాను కూడా బాడీ షేవింగ్ కు గురయ్యానని..

యాక్టింగ్ స్కూల్లో చేరినప్పుడు తన శరీర బరువును కించపరిచేలా కొందరు మాట్లాడారని… నీకు సినిమాల్లో ఛాన్సులు రావు.. కేవలం బర్గర్లు తినే పాత్రలు, ఫ్రెండ్ క్యారెక్టర్లు మాత్రమే వస్తాయని ఎద్దేవా చేశారని తెలిపింది. లావుగా ఉన్నందుకు కూడా కొందరు దారుణంగా కామెంట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంతకుముందు అంజలి కొన్ని టీవీ షోలలో తనదైన ముద్రవేసింది. తనదైన నటనతో అభిమానులను అలరించింది. లావుగా ఉన్న అమ్మాయిలు ఈ కీల‌క పాత్ర‌లు ఎలా ? చేస్తారని పలువురు తన క్యారెక్టర్ ను కించపరిచేలా కామెంట్లు చేశారని కూడా ఆమె వాపోయింది.

ఇక లావుగా ఉన్న అమ్మాయికి సెకండ్ షోలో ప్రధాన పాత్ర ఎవరు ఇచ్చారు.. బహుశా (Anjali Anand ) ఆమె ఎవరితో అయినా కమిట్ అయి ఉండవచ్చు అందుకే ఇలాంటి పాత్రలో వచ్చాయని కూడా తనను కామెంట్ చేశారని అంజలి వాపోయింది. అయితే వీటిపై తాను అంతే స్థాయిలో స్పందించానని చెప్పింది. ఏది ఏమైనా ప్రస్తుతం రాఖీ రాణి కి ప్రేమ కహాని సినిమాలో అంజలి పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి. నటనకు కావలసింది టాలెంట్ అని శరీర బరువుతో సంబంధం లేదని అంజలి నిరూపించింది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus