Actress Ankitha: బాలయ్య తో చేసిన సినిమా హిట్టయ్యి ఉంటే.. ఇంకా ఇండస్ట్రీలో ఉండేదాన్ని: అంకిత

ఒకప్పటి హీరోయిన్ అంకిత అందరికీ గుర్తుండే ఉంటుంది.వై.వి.యస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రం ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తర్వాత ఈమెకు ‘ధనలక్ష్మీ ఐ లవ్ యు’ ‘ప్రేమలో పావని కళ్యాణ్’ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సింహాద్రి’ లో కూడా ఓ హీరోయిన్ గా మెరిసింది.

దీంతో ఆమెకు 2004లో వచ్చిన మరో పెద్ద సినిమా ‘విజయేంద్ర వర్మ’ లో నటించే ఛాన్స్ లభించింది. కానీ ఈ సినిమా ఆమెకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమె నవదీప్ తో ‘మనసు మాట వినదు’, గోపిచంద్ తో ‘రారాజు’, రవితేజతో ‘ఖతర్నాక్’ వంటి సినిమాల్లో నటించినా ఈమెకు కలిసి రాలేదు. ఇటీవల ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బాలయ్యతో చేసిన ‘విజయేంద్ర వర్మ’ ప్లాప్ అవ్వడం వల్లే ఇండస్ట్రీకి దూరమవ్వాల్సి వచ్చింది అంటూ కామెంట్లు చేసింది.

ఆమె మాట్లాడుతూ.. “బాలకృష్ణతో చేసిన ‘విజయేంద్ర వర్మ’ సినిమా పై నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది. నా పాత్రకు మంచి గుర్తింపు వస్తుంది అని ఆశించాను. కానీ ఫలితం నేననుకున్నట్టు రాలేదు. ఆ చిత్రం హిట్ అయ్యుంటే నేను ఇంకా ఇండస్ట్రీలో ఉండేదాన్ని. ఇక్కడ సక్సెస్ ఉంటేనే కెరీర్ ముందుకు సాగుతుంది.

లేదంటే కష్టం’’ అంటూ అంకిత చెప్పుకొచ్చింది. ఇక (Ankitha) అంకిత 2016లో విశాల్ జగపతి అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడింది.ఆమెకు ఇద్దరు అబ్బాయిలు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus