రోడ్డు ప్రమాదాలకు గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.రాష్ డ్రైవింగ్ కావచ్చు, కొంతమంది మధ్య మత్తులో వాహనాలు నడపడం వల్ల కావచ్చు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఇందుకు అతీతం ఏమీ కాదు.తాజాగా లాస్ ఏంజెల్స్‌లో రోడ్డు ప్రమాదానికి గురైంది ఓ కారు.ఇందులో ప్రముఖ హాలీవుడ్ నటి అన్నే హెచ్చి ఉండడం ఆమెకు తీవ్రంగా గాయాలవ్వడం జరిగింది. మార్ విస్టాలో అన్నే హిచ్చి ప్రయాణిస్తున్న కారు ఓ ఇంటిని ఢీ కొట్టింది.
అది రెండు అంతస్థుల గల ఇల్లు. ఆ కార్ ఢీ కొట్టగానే ధ్వంసమైంది. బ్లూ కలర్ మినీ కూపర్ కావడంతో ఇంత డామేజ్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్ అయిన టైములో భారీ మంటలు కూడా వ్యాపించాయట.ఫైర్ స్టేషన్ వారు ఈ మంటలను ఆర్పేందుకు గంట పైనే టైం పట్టినట్టు తెలుస్తుంది. ఇక అన్నే హిచ్చి పరిస్థితి పర్వాలేదు అని వైద్యులు చెప్పినప్పటికీ ఎక్కువ గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్ వల్ల ఆమె షాక్ కు కూడా గురైనట్టు వారు చెబుతున్నారు.
కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అన్నే హిచ్చి 1990 లలో ఫేమస్ నటిగా ఓ వెలుగు వెలిగింది. ‘అనదర్ వరల్డ్’ అనే టీవీ షోతో ఈమె బాగా పాపులర్ అయ్యింది.ఈ సీరియల్ లో విక్కీ హడ్సన్ ,మార్లే లవ్ గా ఈమె డ్యూయల్ రోల్ పోషించింది. ఇందులో ఆమె పెర్ఫార్మన్స్ కు గాను ఆమె డేటైమ్ ఎమ్మీ అవార్డుని సొంతం చేసుకుంది. డోనీ బ్రాస్కో, సిక్స్ డేస్ సెవెన్ నైట్స్, వాగ్ ది డాగ్ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించింది.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?