అనూ ఇమాన్యుయేల్… బోల్డ్ డెసిషన్ వెనుక కారణం..?

కొంతమందికి ఎంత ట్యాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రాదు.అయితే మరికొంత ట్యాలెంట్ ఉన్న వాళ్ళకి మొదట్లో అదృష్టం కలిసొచ్చేనా అది ఎంతో కాలం నిలబడదు. ఈ రెండో కోవకు చెందిన అమ్మాయే అనూ ఇమాన్యుయేల్. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. చెప్పాలంటే ఈమె పెద్ద కలర్ కాకపోయినా.. మొహం నిండా కళే..! అందుకే మొదటి చిత్రంతోనే ప్రేక్షకులకు దగ్గరైంది.

రెండో చిత్రం..’కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ తో కూడా ఆకట్టుకుంది. దాంతో ఆమెకు పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’, నాగ చైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ చిత్రాలు అన్నీ ప్లాప్ అవ్వడంతో .. ఈ అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. ‘గీత గోవిందం’ అనే హిట్ చిత్రంలో నటించినప్పటికీ.. ఆ చిత్రంలో ఈమెది చిన్న పాత్రే..! ఇక ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్- సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో కూడా నటిస్తుంది.

కానీ ఆ చిత్రంలో కూడా ఈమెది చిన్న పాత్రే అని తెలుస్తుంది. ఈ క్రమంలో రొమాంటిక్ సీన్లు కలిగిన వెబ్ సిరీస్ లలో కూడా నటించడానికి ఈమె రెడీ అయిపోయిందట. అందుకు సంబంధించిన స్టోరీ డిస్కషన్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇలా అయినా ఈమె సక్సెస్ అవుతుందేమో చూడాలి. ఒకవేళ సక్సెస్ అయినా కూడా.. మళ్ళీ మళ్ళీ ఈమెను అలాంటి పాత్రలకే దర్శక నిర్మాతలు సంప్రదించే ప్రమాదం ఉంది.

1

2

3

4

 

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus