Anupama, Ravi Teja: రవితేజ పాన్ ఇండియా సినిమాలో అనుపమ.. నిజమెంత?

అనుపమ పరమేశ్వర గత కొన్ని నెలల వరకు ఈమెకు ఎలాంటి అవకాశాలు లేకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుని ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే నిఖిల్ సరసన తాజాగా ఈమె నటించిన కార్తికేయ2 సినిమా మంచి హిట్ కావడంతో ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. కార్తికేయ 2సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఇలా నార్త్ ఇండస్ట్రీలో కూడా అనుపమ పరమేశ్వరన్ కు మంచి క్రేజ్ దక్కడంతో ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమా అవకాశాలు రావడం విశేషం.టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజుగా పేరు సంపాదించుకున్న రవితేజ తన తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో చేయాలని భావించారు. రవితేజ ప్రధాన పాత్రలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకేక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ సరసన నటించడం కోసం అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇక రవితేజ హీరోగా నటించబోయే ఈ సినిమాకు ఈగల్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట.

ఇలా కార్తికేయ సినిమా మంచి హిట్ కావడంతో ఈమె ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమా అవకాశాలను అందుకోవడం విశేషం అయితే ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన తెలియజేయునన్నట్లు సమాచారం. ఇక అనుపమ సినిమాల విషయానికి వస్తే ఈమె 18 పేజెస్, బటర్ ఫ్లై వంటి సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus