పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయిన చాందినీ చౌదరి.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుని మంచి పేరు సంపాదించుకుంది. అయితే హీరోయిన్ గా అనుకున్న స్థాయిల్లో సక్సెస్ కాలేకపోయింది అని చెప్పాలి. ‘కేటుగాడు’ ‘శమంతకమణి’ ‘హౌరా బ్రిడ్జ్’ ‘కుందనపు బొమ్మ’ ‘మను’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అవి ఆడలేదు. కమర్షియల్ హీరోయిన్ గా ఎదగాలి అనుకున్న ఈమె కల నెరవేరలేదు. మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో చిన్న పాత్రలో నటించినప్పటికీ..
అది కూడా అంత గుర్తుంచుకునే పాత్ర అయితే కాదు. అయితే క్రిష్ నిర్మాణంలో వచ్చిన ‘మస్తీస్’ వెబ్ సిరీస్ ఈమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కథా ప్రాధాన్యత ఉన్న పాత్రలను పోషిస్తూ ఫామ్లోకి వచ్చింది. ‘కలర్ ఫోటో’ ‘సమ్మతమే’ వంటి చిత్రాలు ఈమెను సక్సెస్ ట్రాక్ ఎక్కించాయి అని చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు రూటు మార్చి గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. (Chandini Chowdary) ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :