నెట్లో సందడి చేస్తున్న ప్రభాస్ లేటెస్ట్ పిక్..!

గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఛార్మీ. ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి క్రేజీ హీరోల సినిమాల్లో నటించింది. అందంతో పాటు మంచి నటన, డ్యాన్స్ లతో కూడా ఛార్మీ ప్రేక్షకులను అలరించేది. అయితే కొత్త హీరోయిన్ల ఎంట్రీతో ఛార్మీ రూటు మార్చింది. ఒకటి రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది కానీ.. అవి సక్సెస్ కాకపోవడంతో నిర్మాతగా సెటిల్ అయిపోయింది. పూరి జగన్నాథ్ తో కలిసి అతను తెరకెక్కించే సినిమాలను నిర్మిస్తూ వస్తోంది ఛార్మీ.

గతేడాది ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కూడా అందుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ‘నా 9 నెలల బేబీ బాయ్ తో డార్లింగ్’ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ‘ఛార్మీకి ఇంకా పెళ్ళి కాలేదు కదా? మరి 9 నెలల బేబీ ఏంటి?’ అని మీకు డౌట్ రావచ్చు.అయితే ఇక్కడ బేబీ బాయ్ అంటే.. ఛార్మీ కౌర్ పెంచుకునే కుక్క. ఇక ఈ కుక్కతో మన డార్లింగ్ ప్రభాస్ ఓ ఫోటో దిగాడు. ఇదే విషయాన్ని ఛార్మీ అలా చెప్పిందన్న మాట.

ఈ ఫోటోని గనుక మనం పరిశీలిస్తే.. సోఫాలో ప్రభాస్ రాజసంగా కూర్చుని ఉండగా… పక్కన ఛార్మీ పెంపుడు కుక్క ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ ను కూడా ఈ ఫోటో ఆకట్టుకుంటుంది. మొన్నటికి మొన్న కాస్త బొద్దుగా కనిపించిన ప్రభాస్ ఇప్పుడు స్లిమ్ అయినట్టు కనిపిస్తున్నాడు. ఈ మధ్యనే ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఇటలీ షెడ్యూల్ ను కూడా ఫినిష్ చేసిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus