ఒకప్పటి హీరోయిన్ దేవిక ఇప్పుడు ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు.సీనియర్ ఎన్టీఆర్ వంటి హీరోల సరసన నటించింది. కృష్ణకుమారి, సావిత్రి వంటి హీరోయిన్లు ఫుల్ స్వింగ్లో ఉన్న రోజుల్లో ఈమె హీరోయిన్ గా రాణించింది. ఈమె 2002 లో 59 ఏళ్లకే మరణించిన సంగతి తెలిసిందే.1968 లో ఈమె దేవదాస్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకుంది. 1990 లో వీళ్ళు విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దేవిక గురించి మాజీ భర్త దేవదాస్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
Actress Devika Husband Devadoss
దేవిక భర్త దేవదాస్ మాట్లాడుతూ.. “అప్పట్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నా జీతం రూ.200. ఒక చిన్న రూమ్ లో ఉండేవాడిని. ఆ టైంలో దేవిక నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పింది. నేను కాదనలేకపోయాను.నన్ను పెళ్లి చేసుకుంటానని మొదట ఆమెనే చెప్పింది. అయితే నీ ఆలోచనలు.. నా ఆలోచనలు ఒక్కటి కాదు. మనకు కుదరదు అని నేను చెప్పాను. అయినా ఆమె వినలేదు. దీంతో నన్ను అర్థం చేసుకుందేమో అని సంతోషించి పెళ్లి చేసుకున్నాను.
6,7 ఏళ్లు బాగానే కలిసున్నాం. కానీ కనక పుట్టాక.. మా మధ్య గొడవలు మొదలయ్యాయి. తర్వాత అవి క్రమంగా పెరుగుతూ వచ్చాయి. దీంతో విడాకులు తీసుకున్నాము.కెమెరా ముందు మాత్రమే కాదు.. మా ఫ్యామిలీలో కూడా దేవిక చాలా బాగా నటించేది. ఈ విషయం నాకు తర్వాత తెలిసొచ్చింది. నన్ను ఓ శత్రువులా చూసింది అని అర్థమైంది. ఒక సందర్భంలో అయితే మెడలో తాళి తీసి నా మొహాన కొట్టింది.
32 ఏళ్ళ పాటు కోర్టుల చుట్టూ తిరిగాము. ఒక భర్తగా మాత్రమే కాదు తండ్రిగా కూడా నేను ఫెయిల్ అయ్యేలా చేసింది నా భార్య. తర్వాత నా కూతురు కూడా నన్ను పట్టించుకోలేదు. ఆస్తి కోసం నా కూతురు నాపై కేసులు వేసింది. దేవిక చనిపోయినప్పుడు కూడా చూడటానికి నేను వెళ్లలేదు” అంటూ చెప్పుకొచ్చాడు.