సినిమా వాళ్ళు ప్రేమించుకోవడం, సహజీవనం మొదలుపెట్టడం.. ఆ తర్వాత కలిసుండాలి అనుకుంటే పెళ్లి చేసుకోవడం లేకుంటే బ్రేకప్ చెప్పేసుకోవడం వంటివి కామన్ గా జరిగేవే.! అయినా సినిమా వాళ్ళు ఒక్కసారి బ్రేకప్ చెప్పేసుకున్నాక.. తమ మాజీ లవర్ గురించి స్పందించరు. ఎందుకంటే వారి కెరీర్ ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. అది ఓ మోరల్ ఆబ్లిగేషన్ కూడా..! ఇప్పటివరకు బ్రేకప్ చెప్పుకున్న వారి లిస్ట్ కనుక తీస్తే చాలా పెద్దగానే ఉంటుంది.
అయితే బ్రేకప్ తర్వాత నటి దర్శ గుప్తా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. బుల్లితెర పై ‘కుక్ విత్ కోమాలి’ అనే షో తో పాపులర్ అయిన ఈమె ఆ తర్వాత ”రుద్ర తాండవం’, ‘ఓ మై గోస్ట్’ వంటి చిత్రాల్లో నటించి కాస్త ఇమేజ్ సంపాదించుకుంది. అందరి హీరోయిన్లలానే ఈ అమ్మడు కూడా సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా (Actress) ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన లవ్, బ్రేకప్ కహానీ గురించి చెప్పుకొచ్చింది. అంతేకాదు బ్రేకప్ తర్వాత కూడా తన ప్రియుడు ఇప్పటికీ తనే కావాలని వేడుకుంటాడంటూ ఈమె కాస్త హెచ్చులకు పోయింది. అయితే ప్రేమికుల మధ్య నమ్మకమే ముఖ్యమని.. ఒక్కసారి అది పోతే ఇక ఏమీ చేయలేమని ఈమె తెలిపింది. నిజాయితీ కోల్పోయిన వాడు కోటీశ్వరుడు అయినా అవసరమని లేదని, నిజాయితీగా ఉండేవాడు గుడిసెలో ఉన్నా పర్వాలేదని దర్శా గుప్తా పేర్కొంది.