Hansika: నయనతార కన్నా ఆ విషయంలో చాలా ఫాస్ట్ గా ఉన్న హన్సిక!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నయనతార హన్సిక కూడా ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. వీరిద్దరు కూడా ఇతర భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అదేవిధంగా ఇద్దరు కూడా గత ఏడాది ప్రేమ వివాహాలు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.ఇలా అన్ని విషయాలలోనూ పోటీగా వెళుతున్నటువంటి ఈ హీరోయిన్స్ ఒక విషయంలో మాత్రం నయనతారను వెనక్కి నెట్టి హన్సిక ముందున్నారని చెప్పాలి.

అసలు వీరిద్దరికి ఏ విషయంలో పోటీ ఏర్పడింది అసలేంటి మేటర్ అనే విషయానికి వస్తే…నయనతార హన్సిక ఇద్దరు కూడా తాము ప్రేమించిన వ్యక్తులను వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. నయనతార వివాహం జరిగి ఏడు నెలలు కాగా హన్సిక వివాహం జరిగి నెల పూర్తి అయింది. ఇక వీరిద్దరు కూడా ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరుపుకొని ఈ వివాహం ద్వారా కూడా భారీగా డబ్బును సంపాదించారు.

నయనతార తన వెడ్డింగ్ వీడియో నెట్ ఫ్లిక్స్ కి ఇవ్వగా, హన్సిక తన వెడ్డింగ్ వీడియోను హాట్ స్టార్ కి భారీ ధరలకు అమ్మేశారు. ఇకపోతే నయనతార వివాహం జరిగే ఏడు నెలలైనా ఇప్పటివరకు తన వెడ్డింగ్ వీడియో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాలేదు కానీ నేల కిందట వివాహం చేసుకున్న హన్సిక మాత్రం తన వెడ్డింగ్ వీడియో త్వరలోనే హాట్ స్టార్ లో ప్రసారం కాబోతుందని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఈ విషయంలో నయనతార కన్నా హన్సిక చాలా ఫాస్ట్ గా ఉన్నారనీ అభిమానులు భావిస్తూ హన్సిక వెడ్డింగ్ వీడియో కోసం ఎదురుచూస్తున్నారు. నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోగా హన్సిక తన బిజినెస్ పార్ట్నర్ సోహెల్ కతురియా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus