సీనియర్ నటి హేమ(Hema) .. పరిచయం అవసరం లేని పేరు. 40 ఏళ్ళ నుండి సినిమాల్లో ఉంది. మొదట్లో హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ తో పాపులర్ అయిన ఈమె.. ఆ తర్వాత వదిన, అక్క అటు తర్వాత పిన్ని,అత్త వంటి పాత్రలు చేస్తూ మెప్పించింది. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో ‘మా అసోసియేషన్’ ఎన్నికల టైంలో హేమ పనితీరు కూడా హాట్ టాపిక్ అయ్యేది. అంతేకాదు బెంగళూరు డ్రగ్స్ కేసు విషయంలో హేమ..అడ్డంగా బుక్కైపోయిన సంగతి తెలిసిందే.
రేవ్ పార్టీలో దొరికినప్పటికీ ఆమె అక్కడ ఉన్నది నేను కాదు అంటూ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించినట్టు అంతా చెప్పుకున్నారు. అయితే ఎలాగోలా ఆమె బయటపడింది. తాను కలిగి ఉన్న రాజకీయ పలుకుబడిని వాడి ఆమె.. ఆ కేసులో నుండి బయట పడినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు కూడా వినిపించాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఆమె సినిమాలు మానేస్తాను అంటూ చెప్పి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది.
హేమ ఈ విషయంపై స్పందిస్తూ.. “ఇక నేను నటనకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు 14 ఏళ్ళ వయసున్నప్పటి నుండి నటిగా కష్టపడుతూనే ఉన్నాను. ఇంకెంతకాలం కష్టపడాలి. ఎవరికోసం కష్టపడాలి. అందుకే నా మనసు ఇక చాలు అని చెబుతుంది.నేను నా కోసం టైం కేటాయించాలని.. హ్యాపీగా గడపాలని భావిస్తున్నాను.
నన్ను నేను ప్రేమించుకునే సమయం కూడా నేను ఇవ్వాలి కదా” అంటూ వివరణ ఇచ్చింది. అయితే హేమ చేతిలో ఇప్పుడు పెద్దగా ఆఫర్లు కూడా ఏమీ లేవు. ఆమెను దృష్టిలో పెట్టుకుని దర్శకులు పాత్రలు డిజైన్ చేసే దర్శకులు కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ఇలాంటివి గమనించే మీడియా ముందు జాగ్రత్తగా హేమ అలా చెప్పినట్టు అర్థం చేసుకోవచ్చు.