చంద్ర మోహన్.. ఈ తరం ప్రేక్షకులకు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుసు. కానీ, ఆయన కెరీర్ హీరోగా మొదలైంది. 1966 లో ‘రంగులరాట్నం’ అనే సినిమా ద్వారా చిత్రపరిశ్రమకి పరిచయం అయ్యారు. తన మొదటి సినిమా నుండే చంద్రమోహన్ ఒక మంచి నటుడిగా అనిపించుకుని కొన్ని దశాబ్దాల పాటు కొన్ని వందల సినిమాల్లో వివిధ రకాలైన, వైవిధ్యం వున్న ఎన్నో పాత్రలు చేశారు. చంద్రమోహన్ శనివారం ఉదయం హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల చంద్రమోహన్
చంద్ర మోహన్ సరసన ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరంటే? సహజ నటి జయసుధ పేరు చెప్పాలి. వాళ్లిద్దరూ 34 చిత్రాల్లో జంటగా నటించారు. లక్ష్మి, వాణిశ్రీ, రాధిక, మాధవి, జయప్రద, విజయ శాంతి… ఈ హీరోయిన్లతో కూడా ఆయన పది, పదిహేను సినిమాలు చేశారు. చంద్రమోహన్ కు జయసుధ నివాళులు అర్పించింది.. ఆయన గురించి మాట్లాడుతూ.. నా ఫేవరెట్ నటుడు చంద్రమోహన్. అతను ఎటువంటి పాత్ర అయినా చాలా సునాయాసంగా చెయ్యడమే కాకుండా, ఆ పాత్రకి గొప్ప ఔన్నిత్యాని తెచ్చేవారు.
నేను నిర్మాతగా మారి సుమారు ఏడు సినిమాలు చేసాను, అందులో అయిదు సినిమాల్లో చంద్రమోహన్ వున్నారు, అతను ఒక అద్భుత నటుడు. ఆయన నన్ను ఎప్పుడూ తన కుటుంబ సభ్యురాలిగానే చూసేవారు. అటువంటి నటుడుని ఈరోజు మనం కోల్పోయాం, అది దురదృష్టం,” అని చెప్పారు జయసుధ.
చంద్రమోహన్ –జయసుధ (Jayasudha) కాంబో లో చాలా పెద్ద హిట్ సినిమాలు ఉన్నాయి. ‘ఇంటింటి రామాయణం’, ‘ప్రాణం ఖరీదు’, ‘పక్కింటి అమ్మాయి’, ‘గోపాలరావుగారి అమ్మాయి’, ‘అమ్మాయిమనసు’, ‘శ్రీమతి ఒక బహుమతి, ‘స్వర్గం’, ‘కలికాలం వంటి సినిమాలు ఉన్నాయి.