Jeevitha: ఆ హీరోకి చెల్లెలుగా నటించబోతున్న నటి జీవిత!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోయిన్లుగా నటించిన వారందరూ కూడా తిరిగి తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సీనియర్ హీరోయిన్స్ అయినటువంటి ఆమని ఇంద్రజ మీనా రాశి వంటి వారు ఇప్పటికే తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వెండితెర సినిమాలు బుల్లితెర సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మరొక నటి సైతం రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి జీవిత రాజశేఖర్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

అయితే ఈమె నటుడు రాజశేఖర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అయితే ఈమె ఇండస్ట్రీలో దర్శకురాలిగా నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా తెర వెనుక తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న జీవిత త్వరలోనే తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్నటువంటి ఈమె తన కుమార్తెలు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ లను ఇండస్ట్రీకి హీరోయిన్లుగా పరిచయం చేశారు.

ఇలా ఒకవైపు తండ్రి కూతుర్లు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండగా తాజాగా నటి జీవిత సైతం తిరిగి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్నటువంటి లాల్ సలాం సినిమాతో జీవిత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ చెల్లెలు పాత్రలో నటించడం కోసం మేకర్స్ నటి జీవితను సంప్రదించగా ఆమె కథ మొత్తం విని ఈ సినిమాలో రజనీకాంత్ కు చెల్లెలుగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఇలా రజినీకాంత్ సినిమా ద్వారా ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus