Keerthy Suresh: తన తొలి సంపాదన గురించి చెప్పి ఆశ్చర్యపరిచిన కీర్తి సురేష్..!

‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే ‘నేను లోకల్’ ‘అజ్ఞాతవాసి’ వంటి బడా చిత్రాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. అయితే ‘మహానటి’ చిత్రం ఈమెను ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్ ను చేసేసింది. ఆ తరువాత కోలీవుడ్లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి బిజీ యాక్ట్రెస్ గా మారిపోయింది. ఇక వుమెన్ సెంట్రిక్ సినిమాల్లో కూడా నటించి సక్సెస్ అవ్వాలని భావించిన కీర్తికి… అనుకున్న ఫలితం దక్కకపోగా.. విమర్శల పాలయ్యేలా చేసింది.

త్వరలో ‘గుడ్ లక్ సఖి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కీర్తి సురేష్. దీంతో పాటు రజనీ కాంత్ ‘అన్నాతె’, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన మొదటి సంపాదన గురించి చెప్పి ఆశ్చర్యపరిచింది. ఆమె మాట్లాడుతూ… ‘చిన్న వయసులో నటించేటప్పుడు నిర్మాత‌లు నా చేతికి డ‌బ్బుల క‌వ‌ర్ ఇచ్చేవారు.

నేను దానిని ఓపెన్ చెయ్యకుండా నేరుగా మా నాన్న‌ దగ్గరకు తీసుకెళ్ళి ఇచ్చేసేదాన్ని. అందులో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవాలని కూడా నేను ప్రయత్నించలేదు. అయితే కాలేజీలో ఫ్యాష‌న్ డిజైనింగ్ చేసే టైములో ఓ షోలో పాల్గొన్నాను. అప్పుడు నాకు రూ. 500 వచ్చింది. నాకు ఊహ తెలిశాక నేను అందుకున్న‌ది ఇదే.. ! అందుకే ఇదే నా మొదటి సంపాదన గా భావించాను. దీనిని కూడా తరువాత మా నాన్నగారికే ఇచ్చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus