Kushboo: అరుదైన వ్యాధితో ఆసుపత్రిలో చేరిన ఖుష్భూ!

సీనియర్ స్టార్ హీరోయిన్, అలాగే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఖుష్బూ… హాస్పిటల్‌ పాలైంది. ఈ విషయాన్ని స్వయంగా ఖుష్బూ చెప్పుకొచ్చింది. దీంతో కోలీవుడ్ జనాల్లో ఆందోళన మొదలైంది. విషయం ఏంటి అంటే.. ‘ఖుష్బూ ఆరోగ్య పరిస్థితి బాలేదని చెప్పింది. జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం ఇలా అన్నీ ఆమెకు వచ్చాయట. ‘ఎడినో’ వైరస్‌ సోకడం మూలాన చాలా ఇబ్బందిగా ఫీలవుతుందట. ఈ మధ్య కాలంలో ఎడినో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

ఈ వైరస్‌ సోకినవారికి జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి సమస్యలు ఎక్కువవుతాయి. కొంతమందికి ఈ వైరస్ బారిన పడినప్పటికీ లక్షణాలు కనిపించడం లేదని తెలుస్తుంది. ‘మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరి రక్షించుకోండి..నిర్లక్ష్యం చేయకండి’ అంటూ ఈమె చెప్పుకొచ్చింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఖుష్బూ ఫాలోవర్స్ కామెంట్లు పెడుతున్నారు. ఖుష్బూ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’ అనే సినిమాలో నటిస్తుంది.

మే 5న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇంకా పలు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. రాజకీయాల్లో కూడా ఈమె బిజీగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన ఖుష్బూ ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్ 2’ ఆడియో రిలీజ్ లో మెరిసింది. ఆ క్రమంలో మణిరత్నం- సుహాసిని లతో ఉన్న అనుబంధాన్ని ఈమె చాలా గొప్పగా చెప్పుకొచ్చింది. ఇంతలో ఈమెకు ఇలా అవ్వడం విషాదకరం.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus