Actress Laya: టాలీవుడ్ సినిమాల్లోకి లయ కూతురు ఎంట్రీ ఇవ్వనున్నారా?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన లయ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. తొలి సినిమాకే నంది అవార్డ్ ను సొంతం చేసుకున్న లయ ఆ తర్వాత మనోహరం, ప్రేమించు సినిమాలకు సైతం అవార్డులను సొంతం చేసుకున్నారు. ఏకంగా 13 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో విజయవంతంగా లయ కెరీర్ ను కొనసాగించారు. తాజాగా ఒక ఇంటర్య్వూలో లయ తన కూతురి సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా భర్త పేరు శ్రీ గణేష్ గోర్తి అని ఆయన అమెరికాలో ప్రముఖ డాక్టర్ అని లయ తెలిపారు. మాది పెద్దలు కుదిర్చిన వివాహం అని ఆమె చెప్పుకొచ్చారు. సినిమాల్లో నటించవద్దని నా భర్త నాకెప్పుడూ చెప్పలేదని లయ పేర్కొన్నారు. నా భర్త వైద్య వృత్తిలో ఎప్పుడూ బిజీగా ఉంటారని ఆమె కామెంట్లు చేశారు. నా భర్త ఒక్కరే అన్నీ చూసుకోగలరని అమెరికాలో నేను ఐటీలో పని చేశానని లయ అన్నారు.

నాకు ఇద్దరు పిల్లలని అమ్మాయి తొమ్మిదో తరగతి చదువుతోందని లయ తెలిపారు. నా కూతురు ఒక సినిమాలో చేస్తే బాగుంటుందని అనిపిస్తుందని లయ చెప్పుకొచ్చారు. నా కూతురు అమర్ అక్బర్ ఆంటోని మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిందని లయ కామెంట్లు చేశారు. కూతురితో కలిసి ఎక్కడికైనా వెళితే మీ సిస్టరా అని అడుగుతారని ఆమె చెప్పుకొచ్చారు.

నా పిల్లలు తెలుగులో బాగా మాట్లాడతారని ఇంగ్లీష్ లో మాట్లాడటం మొదలుపెట్టాక వాళ్లు తెలుగు మరిచిపోయారని ఆమె అన్నారు. మా మదర్ వాళ్ల కజిన్ నాకు పెళ్లి సంబంధం కుదిర్చిందని లయ చెప్పుకొచ్చారు. లయ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus